Site icon NTV Telugu

Extra Marital Affair: లేటు వయసులో ఘాటు లవ్.. ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్‌ చేయించిన వైనం

Karnataka

Karnataka

ఈ మధ్య వివాహేతర బంధాలు.. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కూడా చంపేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు కొంత మంది భార్యామణులు. కొత్తగా పెళ్లైన వారైనా సరే.. ఏళ్ల తరబడి కాపురం చేస్తున్నవారైన సరే.. దీనికి మినహాయింపు లేకుండా పోయింది. కర్ణాటకలో మరీ దారుణంగా వృద్ధాప్యానికి దరిదాపుల్లో ఉన్న మహిళ ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్‌ చేయించడం కన్నడనాట సంచలనం సృష్టించింది. లేటు వయసులో ఘాటు లవ్.. నిజానికి ఈ మాటల్ని వృద్ధ దంపతులు అత్యంత అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపితే వాడతాం.. కానీ కర్ణాటకలో ఓ మహిళ.. తన భర్తతో కాకుండా మధ్య వయసు ఉన్న యువకుడితో ఘాటు లవ్ ట్రాక్ నడిపింది. అంతే కాదు.. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చింది.

Also Read:Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఈ ఫోటోలో ఉన్న వృద్ధ దంపతుల పేర్లు సుబ్రమణ్య, మీనాక్షమ్మ. ఇద్దరూ భార్య భర్తలు. కర్ణాటకలోని చిక్కమగళూరు వీరి స్వస్థలం. నిజానికి అంతా బాగా ఉంటే వీరిద్దరూ షష్టిపూర్తి చేసుకోవాల్సి ఉంది. కానీ సుబ్రమణ్య చనిపోయాడు.. అతన్ని మర్డర్ చేయించినందుకు మీనాక్షమ్మ జైలు పాలైంది. దాదాపు 2 నెలల క్రితం జరిగిన ఘటనలో.. సుబ్రమణ్య కనిపించకుండా పోయాడు. అన్ని ప్రాంతాలు వెతికిన తర్వాత భార్య మీనాక్షమ్మ, ఇద్దరు కూతుళ్లు అతనిపై మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు.. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీని కనుక్కున్నారు. రైలు ఢీకొట్టినట్లుగా ఉంది. డెడ్ బాడీకి కొద్ది దూరంలోనూ కొన్ని శరీర భాగాలు పడి ఉన్నాయి. వాటిని సమీకరించి… పోస్టు మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందించారు.

Also Read:Railway Luggage Rule: రైల్వే ప్రయాణికుల అదనపు లగేజీపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి

ఐతే సుబ్రమణ్య మృతిపై పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. పక్కా మర్డర్ అని భావించారు. ఆ దిశగా దర్యాప్తు చేశారు. ముందుగా భార్య మీనాక్షమ్మపై ఎలాంటి డౌట్ రాలేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా.. పోలీసులకు జులై 31న ఓ సీసీ ఫుటేజీ అనుమానాస్పదంగా కనిపించింది. దానిలో ముగ్గురు యువకులు సుబ్రమణ్యను కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు గుర్తించారు. ప్రదీప్, సిద్దేష్, విశ్వాస్ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అందులో ప్రదీప్ అనే 33 ఏళ్ల వ్యక్తికి మీనాక్షమ్మతో వివాహేతర బంధం ఉన్నట్లుగా గుర్తించారు. అంతే కాదు.. వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో మీనాక్షమ్మ సూచన మేరకే సుబ్రమణ్యను మర్డర్ చేయించినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు పోలీసులు. కూతుర్ల ఫిర్యాదు మేరకు మీనాక్షమ్మను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Exit mobile version