Wife Murder Attempt: డామిట్ .. భర్తను అడ్డంగా నరికేందుకు వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Murder Attempt: వివాహేతర బంధంతో మరో భార్య తెగించింది. భర్తను అడ్డంగా నరికేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్చేసింది. కానీ.. డామిట్ కథ అడ్డం తిరిగింది. భార్యామణి వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది. భర్త తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ కత్తివేటు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.
READ ALSO: Tamarind Pulihora Recipe: అచ్చం గుడిలో పెట్టె ప్రసాదంలా ఉండే చింతపండు పులిహోర.. చేసేయండి ఇలా!
Also Read
- Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
ఆయన పేరు.. కిర్ల కుమార్. పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాధపురం ఈయన స్వస్థలం. కిర్ల కుమార్ ఓ సాధారణ రైతు. కుటుంబమే తన లోకం అనుకున్నాడు. కానీ అదే కుటుంబం తనకు సమాధి తవ్వుతుందని ఊహించలేదు. ఆయన.. ఆస్పత్రి బెడ్ మీద ఉండడానికి కారణం.. ఈమెవరో కాదు.. కిర్ల కుమార్ భార్య ఈశ్వరమ్మ. భర్తను హత్య చేయాలని పథకం వేసింది. ఇందుకోసం ఈశ్వరమ్మ తన ప్రియుడు సారిక తవుడు, అతని తమ్ముడు ఇష్టం పాపారావుతో కలిసి కిరాతకంగా కుట్ర పన్నింది. ముందుగా మొక్కజొన్న పంటకు మందు కొట్టాలి అని చెప్పింది భార్య. అది నమ్మిన భర్త.. భార్య ఈశ్వరమ్మతో కలిసి పొలానికి వెళ్లాడు. అదే చివరి ప్రయాణమవుతుందని అతను ఊహించలేదు.
పొలానికి చేరగానే ముందే రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ ప్రియుడు సారిక తవుడు, తమ్ముడు పాపారావు సిద్ధంగా ఉన్నారు. ఈశ్వరమ్మ తన వెంట కొడవలి తీసుకొచ్చింది. కాసేపు వేచి చూశారు. ఇక పని కానిచ్చియ్యాలనుకున్నారు. ముగ్గురు ఒక్క క్షణంలోనే కుమార్ పై దాడి చేశారు. భార్య ఈశ్వరమ్మ తన చేతిలో ఉన్న కొడవలితో పీక కోసేందుకు యత్నించారు. అమాయక భర్త ఏం చెయ్యలేని నిసహాయ స్థితిలో పడి ఉన్నాడు. జీవితం ఇక్కడే ముగుస్తుందనుకున్నాడు. కానీ.. విధి మరో అవకాశం ఇచ్చింది. అదే సమయంలో అటుగా కొందరు రావడంతో వారి ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో కుమార్‌ను విడిచి పెట్టి ముగ్గరూ అక్కడి నుంచి పారిపోయారు. బతుకు జీవుడా.. అంటూ అక్కడి నుంచి తప్పించుకున్న కుమార్.. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో అసలు విషయం బయటపడింది. గొంతుపై గాయం కావడంతో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కుమార్.
దంపతుల మధ్య గతంలోనే విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు సమాచారం. రెండు సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. అంతేకాదు.. భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అస్తి అంతటినీ ఈశ్వరమ్మ తన పేరుపై రాయించుకుందని చెబుతున్నారు. ఈ దంపతులకు 14 ఏళ్ల కుమార్తె, 19 ఏళ్ల కుమారుడు ఉన్నారు. తల్లి చేసిన ఈ వ్యవహారం పిల్లల భవిష్యత్తుపై చీకటి నీడలా మారింది కుటుంబ సభ్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో మొదలైన సంబంధం ద్వేషంతో చివరకు భర్త కుమార్‌పై హత్యాయత్నానికి దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పాత్ర, ఆస్తి వివాదాలు, అనైతిక సంబంధం.. ఇలా అన్ని కొణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: BCCI Central Contracts: రోహిత్, విరాట్‌కు భారీ షాక్.. గ్రేడ్ ‘బి’ కి డిమోషన్! గిల్, బుమ్రా టాప్!
తాజావార్తలు
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!