NTV Telugu Site icon

Uttar Pradesh: ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారిని చంపిన భార్య.. ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ పోసిన వైనం

Up

Up

పరాయి వ్యక్తుల మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానాలు పెనుభూతాలుగా మారి భర్త భార్యను, భార్య భర్తను అంతమొందిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారిని భార్య హత్య చేసింది. మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, దానిపై సిమెంట్ పోసి పూర్తిగా మూసివేశారు. ఈ కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read:AP Assembly 2025: 14వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్చంట్ నేవీలో పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్ మీరట్‌లోని ఇందిరానగర్‌లో తన భార్య ముస్కాన్ రస్తోగి, 5 సంవత్సరాల కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కాగా ముస్కాన్ సాహిల్ అనే యువకుడితో ప్రేమాయణం నడిపిస్తోంది. భర్తను అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి సౌరభ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన అతను అక్కడికక్కడే మరణించాడు. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్‌లో వేసి, దుర్వాసన రాకుండా సిమెంట్, నీటితో కలిపిన మిశ్రమంతో నింపారు.

Also Read:NEEK : జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీ రిలీజ్ లాక్

ఆ తర్వాత ముస్కాన్ తన భర్తతో కలిసి హిమాచల్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పి, ఇంటికి బయటి నుండి తాళం వేసి వెళ్లిపోయింది. అయితే చాలా రోజులుగా సౌరభ్ కనిపించకపోవడంతో అనుమానం పెరిగింది. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ తెలిపారు. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు.

Also Read:Telangana Budget: నేడే తెలంగాణ బడ్జెట్.. రూ. 3.20 లక్షల కోట్ల పైనే పద్దు..?

ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించి, తన ప్రేమికుడు సాహిల్‌తో కలిసి సౌరభ్‌ను హత్య చేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తనిఖీ చేయగా ప్లాస్టిక్ డ్రమ్ కనిపించింది. అయితే డెడ్ బాడీని కప్పిపెట్టి సిమెంట్ పోయడంతో బిగుసుకుపోయింది. అతికష్టం మీద డ్రమ్ ను కత్తిరించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి, నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేశారు. కాగా సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కొసమెరుపు.