NTV Telugu Site icon

Madhya Pradesh : లవ్ మ్యారేజ్ చేసుకుంది.. మరో లవర్ దొరకగానే ‘మాజీ’ని మట్టుపెట్టింది

New Project (12)

New Project (12)

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో భార్యాభర్తల మధ్య బంధానికి మచ్చ తెచ్చే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి భర్త అడ్డుగా మారడంతో భార్య భర్తను చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే మరణానికి ముందు భర్త తన భార్య అక్రమ సంబంధాన్ని కనుగొన్నాడు. మొబైల్ ఫోన్‌లోని వీడియో కారణంగా భార్య పన్నాగం బట్టబయలైంది. భార్య, ఆమె ప్రేమికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సలీహా పర్వీన్, బంటు ఖాన్‌లుగా గుర్తించారు.

Read Also: Odisha: హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు..

షాహిద్ ఖాన్, సలీహా ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా సలీహాను షాహిద్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి దాంపత్యం సజావుగానే సాగింది. అయితే కొద్దిరోజుల తర్వాత బంటు ఖాన్‌తో సలీహా అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో షాహిద్‌ను తన దారికి తెచ్చుకోవాలని సలీహా భావించింది. నెలరోజుల నుంచి షాహిద్‌ను హత్య చేయాలని సలీహా ప్లాన్ చేస్తోంది. ఎట్టకేలకు తన ప్లాన్ అమలు చేసింది. తన భర్త అయిన షాహిద్‌కు టీలో విషం కలిపి ఇచ్చింది. టీ తాగిన తర్వాత షాహిద్ విషం కలిపిన విషయాన్ని గ్రహించాడు.. దాంతో తనకు బతికే అవకాశం లేదని తెలుసుకుంటాడు. వెంటనే తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి తన భార్య చేసిన దారుణాన్ని చిత్రీకరించాడు. తన చావుకు భార్య సలీహా, ఆమె ప్రేమికుడు బంటు, అత్తగారే కారణమని ఆరోపించారు. టీ తాగిన తర్వాత షాహిద్ ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Read Also:Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం

కుమారుడి మృతి వార్త తెలిసిన వెంటనే షాహిద్ తండ్రి ఆస్పత్రికి చేరుకున్నారు. షాహిద్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొడుకు చనిపోవడంతో, తండ్రి అతని మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేశాడు. ఈ సమయంలో వారికి మొబైల్ ఫోన్‌లో ఓ వీడియో దొరికింది. ఈ వీడియోలో షాహిద్ తన చావుకు తన భార్యే కారణమని చెబుతున్నాడు. తన భార్య టీలో విషం కలిపిందని కూడా చెప్పాడు. షాహిద్ తండ్రి ఆ వీడియోను పోలీసులకు చూపించి కోడలిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించగా వారు నేరం అంగీకరించారు.

Show comments