Wife Killed Her Husband: పెద్దలందరి సమక్షంలో అతడి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది. ఏడేడు జన్మలు తనకు తోడుంటానంది. కానీ ఇంతలోనే అతడిని పెళ్లి పేరుతో మోసం చేసింది. ఒకరిపై మోహం పెంచుకుని కట్టకున్న వాడి ప్రాణాలను బలితీసుకుంది. ముంగెర్ జిల్లాలోని జమాల్పూర్ లోని ఈస్ట్ కాలనీ పోలీస్ ఏరియాలో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: World Oral Health Day : ఇవి తింటే డెంటల్ డాక్టర్‌తో పనే లేదు
జితేంద్ర అనే వ్యక్తి 2012లో లఖిసారై జిల్లాలో అభయ్‌పూర్ నివాసి అయిన మమతా దేవిని వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇంతలోనే ఆమెకు అజిత్ కుమార్ అలియాస్ చోటుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి.. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అందుకు భర్త కళ్లు గప్పి రహస్యంగా కలుసుకునే వారు. కొద్ది రోజులు భర్తకు తెలియకుండా బాగానే తతంగమంతా నడిపింది మమత, కానీ అక్రమ సంబంధాలన్నీ చాన్నాళ్లు దాగవు కదా. మమతా ప్రవర్తనలో తేడా వచ్చింది. ఆమెపై భర్త జితేంద్రకు ఓ కన్నేశాడు. వారిద్దరూ ఇద్దరూ రహస్యంగా కలవడం, అర్థరాత్రి వరకు మాట్లాడడాన్ని పసిగట్టాడు భర్త జితేంద్ర. మొదట్లో భార్యకు నచ్చజెప్పాలని చూశాడు. కానీ ఆమె చాలాసార్లు నిరసన తెలిపింది.
Read Also:Immoral Relationship : తల్లిని అలా చూసి తట్టుకోలేక.. ఆమె ప్రియుడిని కొట్టి చంపేశారు
అజిత్ కూడా పెళ్లయింది. అతడు పిల్లలతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. ఆదివారం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి రహస్యంగా తన ప్రియురాలైన మమతను కలిసేందుకు వెళ్లాడు. అది చూసిన జితేంద్ర, అజిత్ మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఈ క్రమంలోనే మమతా తన భర్త జితేంద్ర తలపై ఇనుప రాడ్‌తో ప్రియుడు అజిత్‌తో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జితేంద్ర తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మమతా, ఆమె ప్రియుడు అజిత్ ని అరెస్టు చేశారు.
