Site icon NTV Telugu

Crime Scene : చెంపపై కొట్టిన భర్త.. భార్య షాకింగ్‌ నిర్ణయం

Crime

Crime

అస్సాంలోని సిల్చార్‌లో మంగళవారం రాత్రి మహిళ తన భర్తను కత్తితో పొడిచి చంపినందుకు అరెస్టు చేశారు పోలీసులు. మద్యం మత్తులో మహిళను భర్త చెప్పుతో కొట్టాడని, ఆమె కత్తెరతో పొడిచి చంపింది. మరణించిన ఆమె భర్త ఫెర్మిన్ ఉద్దీన్ బర్భయ్య ఆటోరిక్షా డ్రైవర్‌గా గుర్తించారు. గాయపడిన భర్తను అతని భార్య సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్చింది. అక్కడి నుంచి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడిన వ్యక్తిని తీసుకువచ్చిన తర్వాత SMCH వైద్యులు పోలీసులను పిలిచారని కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) నుమల్ మహతా తెలిపారు. “అతని శరీరం యొక్క ప్రధాన భాగాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి, ఇది సంఘటన జరిగిన కొన్ని గంటల్లో అతని మరణానికి దారితీసింది. మా అధికారులు SMCH వద్ద భార్యను కనుగొని ఆమెను అరెస్టు చేశారు,” అని తెలియజేశారు. తన భర్త ప్రతిరోజూ హింసించేవాడని, ఇది తట్టుకోలేక కోపంతో కత్తెరతో పొడిచాను అని విచారణలో మహిళ చెప్పింది.

Also Read : Locked Self: ఆ భయంతో.. మూడేళ్లుగా గృహనిర్బంధంలోనే ఉండిపోయిన తల్లీకొడుకులు!

మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి గొడవ చేస్తూ చెంపపై కొట్టాడు. నాకు కోపం వచ్చి నన్ను రక్షించుకోవడానికి కత్తెరతో పొడిచాను’ అని చెప్పింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే నిజానిజాలు వెల్లడిస్తామని మహతా తెలిపారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు, మెహర్‌పూర్‌లోని కబియురా ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు. అయితే.. వారి ఇంట్లో రోజూ రాత్రి గొడవలు జరిగేవని ఇరుగుపొరుగు వారు తెలిపారు. SMCHలోని వైద్యులు మొదట ఫెర్మిన్ ఉద్దీన్‌కు చికిత్స చేశారు. అయితే గంట వ్యవధిలోనే మృతి చెందాడు.‘శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి.. రక్తం ఎక్కువగా లీకేజీ అయింది.. కాపాడేందుకు ప్రయత్నించినా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు’ అని డాక్టర్ తెలిపారు.

Also Read : New Governor Justice Abdul Nazeer: ఏపీకి చేరుకున్న కొత్త గవర్నర్‌.. స్వాగతం పలికిన సీఎం వైఎస్‌ జగన్‌

Exit mobile version