Site icon NTV Telugu

Warangal: వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్.. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..

Warangal

Warangal

వరంగల్ చౌరస్తాలో వివాహిత కత్తి పట్టుకుని హల్చల్ చేసింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నించింది. భార్య నుండి తప్పించుకునేందుకు జ్యువలరీ షాపులోభర్త దాక్కున్నాడు. వెంటనే డయల్100 కి ఫోన్ చేశాడు భర్త. అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహిళ చేతిలోని కత్తిని పోలీసులు లాక్కున్నారు. తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది వివాహిత జ్యోత్స్న.

Also Read:Mahindra-Tata- M Evs: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ vs టాటా నెక్సాన్ ఈవీ vs ఎంజీ విండ్సర్ ఈవీ.. ఇందులో ఏది బెస్ట్!

తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకొని తనకు విడాకులు ఇస్తున్నాడని ఆరోపించింది. తనకు ఉండడానికి చోటు లేకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్తిని, పిల్లలను తనకు కాకుండా చేస్తున్నాడని మండిపడింది. కాగా విడాకుల కోసం భర్త శ్రీకాంత్ కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలిపింది. పోలీసులు వివాహితకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version