Site icon NTV Telugu

Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!

Wiaan Mulder

Wiaan Mulder

Wiaan Mulder: జింబాబ్వేతో జరిగిన రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అజేయ 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా తన ఇన్నింగ్స్‌ ను 367 పరుగుల వద్దే డిక్లేర్ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్లకు 626 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

Read Also:Russia Over Ukraine: తగ్గేదెలా.. అన్నట్టుగా ఉక్రెయిన్‌పై 100కిపైగా డ్రోన్లతో భారీ దాడి చేసిన రష్యా..!

ఇక ఆట రెండో రోజు ముగిసిన తరువాత విలేకరులతో ముల్డర్ మాట్లాడుతూ.. మా జట్టుకు తగినంత పరుగులు సరిపోతాయి అనిపించింది. మా జట్టు బౌలింగ్ ప్రారంభించాలి అనిపించింది. అలాగే బ్రియాన్ లారా లాంటి గొప్ప ఆటగాడి వద్ద ఆ రికార్డు ఉండటం సరికొత్త తరానికి ప్రేరణ. ఇలాంటి రికార్డులు కొందరివే కావాలి. మళ్లీ అవకాశం వస్తే, నేను అదే పని చేస్తాను అని పేర్కొన్నారు. ముల్డర్ తన ట్రిపుల్ సెంచరీని కేవలం 297 బంతుల్లో పూర్తి చేసి టెస్ట్ చరిత్రలో రెండవ వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. చివరకు 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 334 బంతుల్లో 367 నాటౌట్ గా నిలిచాడు.

Read Also:Gender Reveal Test: వీడు డాక్టర్ కాదు కంత్రీగాడు.. అర్థరాత్రి 2 గంటలకు హాస్పిటల్లో అబార్షన్లు!

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కి ప్రత్యుత్తరంగా జింబాబ్వే కేవలం 170 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో దక్షిణాఫ్రికా 456 పరుగుల భారీ ఆధిక్యం పొందింది. స్పిన్నర్ ప్రెన్నెలాన్ సుబ్రాయన్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ఈ భారీ ఆధిక్యంతో దక్షిణాఫ్రికా జింబాబ్వేను ఫాలోఆన్ ఆడించగా.. రెండవ ఇన్నింగ్స్‌ లో ఆట ముగిసే సమయానికి జింబాబ్వే 1 వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసి ఇంకా 405 పరుగులు వెనుక పడింది.

Exit mobile version