Kuldeep Yadav Breaks Bhuvneshwar Kumar and Yuzvendra Chahal Records in WI vs IND 3rd T20: భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. తన మణికట్టు మయాజాలాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను పెవిలియన్ చేర్చుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 4 వికెట్స్ తీసిన కుల్దీప్.. రెండో వన్డేలో 1 వికెట్, మూడో వన్డేలో 2 వికెట్స్ పడగొట్టాడు. ఇక మొదటి టీ20లో 1 వికెట్ తీసిన అతడు.. మూడో టీ20లో 3 వికెట్లు సాధించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి.. 3 వికెట్లు (బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ మరియు జాన్సన్ చార్లెస్) తీశాడు. దాంతో కుల్దీప్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్స్ పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రికార్డుల్లోకెక్కాడు. కుల్దీప్ 30 మ్యాచ్‌ల్లో 50 వికెట్స్ ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు మరో మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ పేరిట ఉండేది. చహల్ 34 మ్యాచ్‌ల్లో 50 వికెట్స్ తీశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌తో చహల్ రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు.
28 ఏళ్ల కుల్దీప్ యాదవ్ మరో రికార్డు కూడా సాధించాడు. టీ20ల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. దాంతో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. విండీస్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్15 వికెట్లు తీశాడు.33 ఏళ్ల భువనేశ్వర్ 18 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శన చేస్తున్న కుల్దీప్.. ప్రపంచకప్ 2023 రేసులోకి వచ్చాడు.
Charles ☝️
Nicholas Pooran ☝️
Brandon King ☝️Kuldeep Yadav's sensational outing against the Windies! 🔥#KuldeepYadav #WIvsIND #Cricket pic.twitter.com/2jRC1Fs2Re
— OneCricket (@OneCricketApp) August 8, 2023
