WI vs AUS: విండీస్ బౌలర్ల దెబ్బకు విలవిలాడిన ఆసీస్ బ్యాటర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WI vs AUS: వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలాడారు. బ్రిడ్జి టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దానితో మొదట బ్యాటింగ్ చేపట్టిన తొలి రోజు ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం విండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 57 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. విండీస్ బౌలర్ షమార్ జోసెఫ్ పేస్‌తో చెలరేగి ఆసీస్ టాపార్డర్ ను పెవిలియన్‌కు పంపించాడు. నాలుగు వికెట్లు తీసిన జోసెఫ్, మునుపటి ఏడు వికెట్ల డెబ్యూ స్పెల్‌ను మళ్లీ గుర్తు చేశాడు. మొత్తం 16 ఓవర్లలో 46 పరుగులకే 4 వికెట్లు సాధించాడు. మరోవైపు జైడెన్ సీల్స్ 5 వికెట్లను తీసి ఆస్ట్రేలియా పతనానికి కారకుడయ్యాడు.
Read Also:US: గాల్లో ఉండగా విమానంలో మంటలు.. సేఫ్‌గా ల్యాండింగ్.. వీడియో వైరల్
Also Read
ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ఖవాజా 47, ట్రావిస్ హెడ్ 59 మినహా మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేక పోయారు. చివర్లో కమిన్స్ 18 బంతుల్లో 28 పరుగులు చేయడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఇక విండీస్ బ్యాటింగ్ మొదలైన వెంటనే ఆసీస్ పేసర్లు దాడికి దిగారు. స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజల్ వుడ్ లు దెబ్బకు ప్రత్యర్థులు కూడా పెవిలియన్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో స్టార్క్ బ్రాత్‌వైట్, జాన్ క్యాంప్‌బెల్ ను ఔట్ చేయగా.. కమిన్స్ కార్టీని, హేజల్ వుడ్ జోమెల్ వారికన్ ను పెవిలియన్ కు చేర్చారు. దీనితో విండీస్ 57/4 వద్ద నిలిచింది. ప్రస్తుతం బ్రాండన్ కింగ్, కెప్టెన్ రోస్టన్ చేస్ క్రీజులో ఉన్నారు. విండీస్ 22 సంవత్సరాల తర్వాత తమ గడ్డపై ఆసీస్‌పై టెస్ట్ గెలుపు కోసం ఎదురుచూస్తోంది. రెండో రోజు వీరి ఆటే మ్యాచ్ దిశను మార్చనుంది.
Read Also:YS Jagan: నేడు వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ!
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?