NTV Telugu Site icon

Sriramanavami 2024: శ్రీరామనవమి నాడు ఈ ఆలయాలను ఎందుకు సందర్శించాలంటే?

Ramalayaalu

Ramalayaalu

ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17 న వచ్చింది.. రేపు ఈ పండుగను జరుపుకొనేందుకు రామ భక్తులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న రాముని ఆలయాలు ముస్తాబు అయ్యాయి.. రాముడు ఇవాళ నుంచే ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.. సీతారాముల కళ్యాణానికి దేశంలోని ప్రముఖ ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాలను తప్పనిసరిగా సందర్శించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఆ ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రామ్ రాజా ఆలయం.. మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో, శ్రీరాముడు దేవుడిగా,రాజుగా పూజించబడతాడు. ఈ ఆలయం కోట రూపంలో నిర్మించబడింది. ఇక్కడ ప్రతిరోజు ఒక గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది.. ఈ ఆలయంలో రాముడికి సాయుధ వందనం సమర్పించబడుతుంది.. అందుకే ఈ పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు..

అయోధ్య రామమందిరం.. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లో ఉంది.. శ్రీరాముని జన్మస్థలంగా పిలుస్తారు. రాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నదికి కుడివైపున ఉంది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు జన్మించాడని ప్రతీతి.. ఇక బాల రాముడిని ఇటీవల ప్రతిష్టించిన సంగతి తెలిసిందే.. ఈ ఆలయాన్ని నవమి రోజు దర్శించుకుంటే సకల బోగాలు కలుగుతాయని ప్రజల నమ్మకం..

రఘునాథ్ ఆలయం, కాలరామ్ ఆలయాలతో పాటుగా భద్రాచలం, కోదండరామ ఆలయాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందినవి.. వీటిని దర్శించుకొని రామున్ని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు..