Suicidal Thoughts: ఏదో ఒక సందర్భంలో ఇక జీవితాన్ని త్యజించాలనే భావన ప్రతీ మనిషిలో ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ నెగెటివిటీనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల్ని రేకెత్తిస్తుంటుందన్నారు మానసిక నిపుణులు. అయితే ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. రోజూ ఉదయం వేళతోపాటు అత్యధికంగా డిసెంబర్ నెలలోనే ఈ తరహా ఆలోచనలు అధికంగా వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా ప్రజల్లో జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే ప్రతి సమస్యకూ చావే పరిష్కారం కాదని, బతికుండి జీవితాన్ని గెలవాలంటున్నారు మానసిక నిపుణులు. ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా ఈ నెలలోనే ఎందుకు వస్తాయని, వాటి నుంచి ఎలా బయటపడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Prabhas-Riddhi : ప్రభాస్ శారీ గిఫ్ట్ వెనుక స్టోరీ ఇదే.. క్లారిటీ ఇచ్చిన రిద్ధి కుమార్
నెదర్లాండ్స్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్దామ్, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హమ్ స్కూల్ ఆఫ్ సైకాలజీలు సంయుక్త ఆత్మహత్యలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేపట్టాయి. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారి ఆలోచనా విధానం ఏయే సందర్భాల్లో ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎక్కువగా చనిపోవాలని అనిపిస్తుంది, తదితర ప్రశ్నాలను రూపొందించి, ఆరేళ్లపాటు 10 వేల మంది అమెరికా, బ్రిటన్, కెనడా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు శీతాకాలంలోనే ఎక్కువ సూసైడ్ కేసులు ఉంటాయని ప్రజలు అనుకుంటుంటే.. తాజా అధ్యయనంలో ఈ ఆత్మహత్య కేసులు వసంత కాలం లేదా వేసవి తొలినాళ్లలోనే ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. ఈ సందర్భంగా పరిశోధకులు మాట్లాడుతూ.. ఈ ఆత్మహత్యలు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల సమయంలోనే అధికంగా జరుగుతున్నాయని గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఈ కేసులు డిసెంబర్లో భయంకరంగా వెలుగు చూస్తుండగా, జూన్లో చాలా తక్కువగా నమోదు అవుతున్నట్లు కనుగొన్నారు.
తీవ్రమైన మానసిక సంక్షోభానికి ఆత్మహత్యల ఆలోచనలు సంకేతాలు లాంటివని చెబుతున్నారు. దీని వెనుక మూడు రకాల కారణాలు ఉంటాయని.. వాటిలో మొదటిది శరీరానికి సంబంధించిన కారణాలు అని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంటే మెదడులో సెరెటోనిన్ లాంటి హార్మోన్లు పెరగడం వల్ల ఈ సూసైడ్ థాట్స్ వస్తుంటాయని పేర్కొన్నారు. ఇక రెండోది.. మానసిక కారణాలు అని వెల్లడించారు. ఇవి సదరు వ్యక్తి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. మూడోది సామాజిక కారణాలు అని చెప్పారు. వాస్తవానికి ఈ మూడు రకాల కారణాలు ప్రతీ మనిషిలో విడివిడిగా ఉండవని, ఇవన్నీ కలిసే ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంటాయని వివరించారు.
ఈ ఆత్మహత్యల నుంచి బయటపడటానికి ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఈ వ్యా్క్సినేషన్ తీసుకొవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యా్క్సినేషన్ పేరు ఏంటో తెలుసా.. నలుగురితో కలవడం, సంతోషంగా జీవించడం. నిజంగా ఇవే సూసైడ థాట్స్ నుంచి మనుషుల్ని భయటపడేయగలిగే వ్యాక్సినేషన్ అని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ సమస్యతో బాధపడుతున్న వారికి సాయం చేయడానికి అనేక మార్గాలున్నాయని పేర్కొన్నారు.
ఫస్ట్ ఎవరైనా కుంగుబాటుతో బాధపడుతున్నా, నిద్ర సమస్యలున్నా, ఆకలి లేకపోయినా, ప్రతి చిన్న విషయానికి చికాకు పడుతున్నా, తీవ్రంగా స్పందిస్తున్నా.. వారిని వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి.
‘‘దేనిలోనైనా విఫలమైతే ఇక జీవించడం వృథా’’ అనే ఆలోచనల నుంచి యువతను మళ్లించాలి. ఓటమిని కూడా ధైర్యంగా ఎదుర్కొనేలా వారిని మానసికంగా సిద్ధం చేయాలి.
ఆత్మహత్యలను అడ్డుకోవడంలో సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్‌లు కూడా మెరుగ్గా పనిచేస్తాయి. పరివర్తన్ సంస్థ కూడా ఒక 24 గంటల హెల్ప్‌లైన్‌ను (7412040300) నడిపిస్తోంది.
యువతలో ఎక్కువ ప్రేమ విఫలం కావడం లేదా కెరియర్ సమస్యల వల్ల మానసిక సమస్యలు, సూసైడ్ థాట్స్ వస్తుంటాయి. అందుకే ఈ విషయంపై కుటుంబ సభ్యుల మధ్య తరచూగా చర్చ జరిగేలా చూడాలి. దీంతో వారికి మానసికంగా మద్దతు లభించినట్లు అవుతుంది.
