Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha vs Congress High Command: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేసే అవసరం ఏముందని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్ అధిష్టానంతో ఆమె యుద్ధానికి దిగుతున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గేతో చర్చించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుత పరిణామాలపై ఆయనకు లిఖితపూర్వకంగా లేఖ అందజేశానని వెల్లడించారు. తనకు సహకరించాలని ఖర్గేను కోరగా.. సమస్యను పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు సురేఖ పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా లేఖ పంపించినట్లు మంత్రి సురేఖ చెప్పారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
తనను రాజీనామా చేయాలని హైకమాండ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశం రాలేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ‘నేను ఏం తప్పు చేశాను?, ఎందుకు రాజీనామా చేయాలి?’ అంటూ ప్రశ్నించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన వ్యాఖ్యలుగా పరిగణించడం సరికాదన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే కూతురు వ్యాఖ్యలను కూడా పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపైనే కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే మంత్రి సురేఖ బర్తరఫ్కు సంబంధించిన లేఖను లోక్‌భవన్‌కు పంపించే అవకాశం ఉంది. బర్తరఫ్ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలకు సంబంధించి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు సీనియర్ నేతల నుంచి అధిష్ఠానం ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!