Computer Keyboard: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కంప్యూటర్‌ను వాడుతున్నారు. ఇది లేకుండా కంప్యూటర్‌లో ఏ పని జరగదు.. ఏ ఉద్యోగం చేయాలన్నా ముందుగా కంప్యూటర్ ఉండాల్సిందే. అయితే, ఈ కంప్యూటర్ను వాడలాంటే మాత్రం కీ బోర్డు తప్పనిసరి.. కానీ మనం ప్రతి రోజు కీబోర్డుపై చాలా వర్క్ చేస్తాం కానీ.. ఒక విషయం అస్సలు గమనించి ఉండము. అందేంటంటే కీబోర్డులో ఏబీసీడీలు వరుస క్రమంలో ఉండకుండా A ఒక దక్కర ఉంటే B మరో చోట ఉంటుంది. ఇలా కీబోర్డులోని కీస్ అన్ని కూడా గందరగోళంగా సెట్ చేసి ఉంటుంది. ఇలా ఎందుకున్నాయని మీకెప్పుడైన డౌట్ వచ్చిందా..? వచ్చిన పెద్దగా మీరు దాన్ని పట్టించుకొని ఉండకపోవచ్చు. అయితే, ఇప్పుడు అలా ABCDలు వరుస సంఖ్యలో కాకుండా గందరగోళంగా ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం..
Read Also: Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..
అయితే, కీ బోర్డు పైన వరుసలో మొదట Q, W, E, R, T, Y, U, I, O, P అనే అక్షరాలు ఉంటాయి. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి తయారు చేశారట. ఇక, అంతకు ముందు A, B, C, D వరుసగా ఉన్న కీబోర్డుపై ఆయన కొన్ని పడిన ఇబ్బందులను గమనించి.. ఇంగ్లీష్ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువ సార్లు, మరికొన్ని అతి తక్కువగా ఉపయోగిస్తుంటాం.. ఉదాహరణకు Q, Z W, X, లాంటి లెటర్స్‌ను తక్కువగా వాడుతుంటాం.. కాబట్టి, అచ్చులైన A,E,I,O,U లతో పాటు P, B, L, M, N, K, L లాంటి అక్షరాలను ఎక్కువ సార్లు వాడుతుంటాం.. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండా.. ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా క్రిస్టోఫర్ షోల్స్ టైపు మిషన్ కీబోర్డును ‘Qwerty’ నమూనాలో రూపొందించాడు.
Read Also: Puspa 2 Movie Event: ముంబైలో స్టేజి పైనే రెచ్చిపోయిన ఐకాన్ స్టార్, నేషనల్ క్రష్
కానీ, మనం జనరల్ గా ఈ అక్షరాలనే ఎక్కువగా వాడుతుంటాం.. పైనున్న అక్షరాలు తక్కువ ఉపయోగిస్తాం.. అదే ఒరవడి కంప్యూటర్ కీ బోర్డులకూ సైతం విస్తరించింది. అయితే, ఆధునిక పరిశోధనల ప్రకారం.. మరింత ఈజీగా ‘కీ బోర్డు’ అమరికలున్నట్లు రుజువు చేశారు. ఇలా ఎక్కువగా ఉపయోగించే కీస్‌ను బట్టి చేతివేళ్లకు అందుబాటులో ఉండే విధంగా రెడీ చేశారు. అయితే దీనిని ఆధారంగా చేసుకోనే స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఈ కీబోర్డ్‌ను రూపొందించారు. ఈ కారణాల చేతనే కీ బోర్డులో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా క్వర్టీ లేఅవుట్‌ను తయారు చేయడానికి గల కారణమని చెప్పొచ్చు.