NTV Telugu Site icon

PERNI NANI: రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు?.. పేర్ని నాని మండిపాటు

Perni On Babu

Perni On Babu

PERNI NANI: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ (శుక్రవారం) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన పేర్ని నాని.. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1న మాత్రమేనని చంద్రబాబుకు పేర్ని గుర్తుచేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైసీపీ స్టాండ్ అని పేర్నినాని తెలిపారు. చంద్రబాబు లాగా పూటకో నిర్ణయం తమది కాదన్నారు. రెండు రాష్ట్రాలు విడగొట్టాలని తానే చెప్పానని చంద్రబాబు చెబుతున్నారని పేర్ని నాని గుర్తు చేశారు.

Read Also:

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ పార్క్ శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని, మరి బాబు చేసిందేటని పేర్ని ప్రశ్నించారు. 2047 కి పేదల్ని కోటీశ్వరులను చేస్తారట, అప్పటికి బాబు వయసు ఎంత ఉంటుందని పేర్ని అడిగారు.విజన్ 2020 పోయి 2047 వచ్చిందని, అధికారంలో ఉన్నప్పుడు ఏది చెయ్యడని చంద్రబాబుపై సెటైర్లు వేశారు పేర్నినాని. చంద్రబాబు సంపద సృష్టించా అని చెప్తాడని, అసలు పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ప్లాట్లు ఇచ్చాడా అని పేర్ని ప్రశ్నించారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కట్టచ్చుగా, ఎందుకు కట్టలేదని కూడా అడిగారు. పౌర విమనయాన శాఖా మంత్రి అప్పట్లో నీ జేబులో ఉంటే కనీసం వైజాగ్ ఎయిర్పోర్ట్ పనులు కూడా చెయ్యలేదుగా అని పేర్ని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

Read Also:

చంద్రబాబు భ్రమల్లో బతుకుతుంటాడని పేర్ని నాని ఆరోపించారు. నీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నప్పుడే గంటా శ్రీనివాసరావు గంజాయి పెరిగి పోయిందని పేర్ని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నిజం మాట్లాడితే తల వెయ్యి చెక్కలయ్యే శాపం ఉన్నట్లు ఉందని విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకుని రాగలిగాడా అని ప్రశ్నించారు. ఒక్క డిగ్రీ కాలేజీ అయినా కట్టాడా అంటూ చంద్రబాబుపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు పేర్ని నాని.