గోల్డ్ విలువైన మెటల్ గా భావిస్తుంటారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. పసిడితో తయారు చేసిన ఆభరణాలు ధరిస్తుంటారు. బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటారు. డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుగోలు చేస్తున్నారు. మరి ఇంత ఆధరణ ఉండి ఇంత విలువైన లోహం కంటే అత్యంత ఖరీదైన మరో మెటల్ ఉందని మీకు తెలుసా? వరల్డ్ లోనే అత్యంత ఖరైదన మెటల్ ఉంది. ఆ మెటల్ ను జస్ట్ 1 గ్రామ్ అమ్మితే చాలు దాదాపు 200 కిలోల బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఈ లోహాన్ని కాలిఫోర్నియం అంటారు. కాలిఫోర్నియం ఎందుకు అంత ఖరీదైన లోహం, అది ఎక్కడ దొరుకుతుంది. దేనికి ఉపయోగిస్తారు? ఆ వివరాలు మీకోసం.
Also Read:Supreme Court: రూ.2,742 కోట్ల స్కామ్‌పై దాడులు.. మమతపై సుప్రీంకోర్టులో ఈడీ ఆరోపణలు
కాలిఫోర్నియం (Californium) అనేది ఒక అత్యంత అరుదైన, రేడియోఆక్టివ్ రసాయన మూలకం. దీని రసాయన సంకేతం Cf. పరమాణు సంఖ్య 98. ఇది ఆక్టినైడ్ సిరీస్‌కు చెందిన ట్రాన్స్‌యురేనియం మూలకం, అంటే యురేనియం కంటే ఎక్కువ పరమాణు సంఖ్య కలిగినది. 1950లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (University of California, Berkeley)లో స్టాన్లీ థాంప్సన్, గ్లెన్ సీబోర్గ్, అల్బర్ట్ గియోర్సో, కెన్నెత్ స్ట్రీట్ లలాంటి శాస్త్రవేత్తలు క్యూరియం-242ని ఆల్ఫా కణాలతో (హీలియం అయాన్లు) బాంబర్డ్ చేసి ఈ మూలకాన్ని సృష్టించారు.
అందుకే, దీనికి విశ్వవిద్యాలయం పేరు మీద కాలిఫోర్నియం అని పేరు పెట్టారు. ఇది ప్రయోగశాలలలో మానవులు సృష్టించిన మూలకం. ఇది సహజంగా లభించదు. అందుకే కాలిఫోర్నియం చాలా అరుదుగా, ఖరీదైనదిగా ఉంటుంది. దాని కృత్రిమ స్వభావం, అత్యంత అరుదుగా ఉండటం, దానిని ఉత్పత్తి చేసే సంక్లిష్ట ప్రక్రియ కారణంగా అధిక ధర ఉంటుంది.
ధర ఎంత?
కాలిఫోర్నియా ఒక గ్రాము ధర సుమారు 27 మిలియన్ డాలర్లు (దాదాపు 200 కిలోల బంగారం సమానం).. మరోవైపు, ప్రస్తుతం బంగారం కిలోగ్రాముకు సుమారు రూ.13 మిలియన్లు ఖర్చవుతుంది. అందువల్ల, ఒక గ్రాము కాలిఫోర్నియా అమ్మకం ద్వారా 200 కిలోగ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read:TheRajaSaab : రాజాసాబ్ 1st వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ ‘స్టార్ పవర్’
ఎక్కడ ఉపయోగిస్తారు?
అణు రియాక్టర్లను స్టార్ట్ చేయడానికి
బంగారం, వెండి ఖనిజాలను గుర్తించడానికి (న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్)
నూనె బావుల్లో నీరు, నూనె పొరలను గుర్తించడానికి (న్యూట్రాన్ మాయిశ్చర్ గేజ్‌లు)
విమానాల్లో లోహాల్లో ఒత్తిడి, ఫాటీగ్ గుర్తించడానికి
క్యాన్సర్ చికిత్సలో (ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్‌కు Cf-252 న్యూట్రాన్ థెరపీ పరిశోధనలో ఉపయోగం)
న్యూట్రాన్ డిఫ్రాక్షన్, స్పెక్ట్రోస్కోపీలో మెటీరియల్ స్టడీస్ కోసం
