Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం సంభవించింది. నేపాల్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మధ్యాహ్నం 2:53 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. 25 నిమిషాల వ్యవధిలో 4.6, 6.2 తీవ్రతతో రెండు సార్లు ప్రకంపనలు సంభవించాయి.
ప్రకృతి కన్ను తెరిచిందంటే చాలు విలయతాండవం చేస్తుంటుంది. తాజాగా ఇతర దేశాల్లో చోటు చేసుకుంటున్న భూకంపాలు తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భవనాలు కుప్పకూలిపోతున్నాయి. దీంతో తీవ్రమైన నష్టాలు చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. భూకంపాల కారణంగా క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అసలు భూకంపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి..? అందుకు కారణాలు కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.
Also Read: PM MODI: తెలంగాణలో ఒక కుటుంబం.. ప్రజల ఆకాంక్షల్ని కబ్జా చేసింది
భూకంపాలకు ఎందుకు సంభవిస్తాయి?
భూమి నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ నాలుగు పొరలు ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్‌గా ఉంటాయి. క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అంటారు. ఈ 50 కి.మీ మందపాటి పొర అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు.. మనకు భూప్రకంపనలు వస్తాయి. వాస్తవానికి, కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంప కేంద్రం అంటారు. భూకదలిక కారణంగా భౌగోళిక శక్తి విడుదల అవుతుంది. ఈ ప్రదేశం భూకంపాల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతుంది. అయితే, భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే, దాని ప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి.
Also Read: Earthquake: మరోసారి ఉత్తరాఖండ్‌ను వణికించిన భూకంపం..
భూకంపం ఎప్పుడు వినాశనాన్ని తెస్తుంది?
రిక్టర్ స్కేల్‌పై ఆధారంగా భూకంప తీవ్రతను కొలుస్తారనేది తెలిసిన విషయమే. ఆ రిక్టర్ స్కేల్‌పై ఎంత తీవ్రత ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?. అది తెలుసుకుందాం.
*0 నుండి 1.9 వరకు భూకంపం గురించిన సమాచారం సీస్మోగ్రాఫ్ నుంచి మాత్రమే పొందబడుతుంది.
*2 నుండి 2.9 కాంతి మెరిసినట్లుగా అనుభూతిని కలిగిస్తుంది.
*3 నుండి 3.9 వరకు ఒక ట్రక్కు సమీపంలోకి వెళ్లినప్పుడు ఎలా అయితే అనుభూతి చెందుతామో.. ఇదే విధమైన ప్రభావం ఏర్పడుతుంది.
*4 నుండి 4.9 ఇళ్ల కిటికీలు విరిగిపోవచ్చు. గోడలపై వేలాడుతున్న ఫ్రేమ్‌లు పడిపోవచ్చు.
*5 నుండి 5.9 వరకు ఫర్నిచర్ అంతా కిందపడి పోయే విధంగా భూమి కంపిస్తుంది.
*6 నుండి 6.9 భవనాల పునాదులు పగలవచ్చు. పై అంతస్తులు దెబ్బతినవచ్చు.
*7 నుండి 7.9 భవనాలు కూలిపోతాయి. భూగర్భ పైపులు పగిలిపోతాయి. అంతా అల్లకల్లోల వాతావరణం సంభవిస్తుంది.
Also Read: Heavy Rains: కేరళలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. పలు ప్రాంతాల్లో వరదపోటు
భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారు?
భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి రిక్టర్ స్కేల్ ఉపయోగించబడుతుంది. భూకంపాలను రిక్టర్ స్కేలుపై 1 నుంచి 9 వరకు కొలుస్తారు. దీని తర్వాత మాత్రమే భూకంపం తీవ్రత ఎంత, దాని కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో తెలుస్తుంది.
భూకంపం సమయంలో ఏమి చేయాలి?
భూప్రకంపనలు సంభవించినప్పుడు మొదట ప్రశాంతంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు భరోసా ఇవ్వాలి. ఈ సమయంలో, సమీపంలోని భవనాలు లేని బహిరంగ ప్రదేశాలకు భవనాల నుంచి దూరంగా వెళ్లాలి. భూకంపం సంభవించినప్పుడు, ఇంట్లో ఉన్నవారు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. డెస్క్, టేబుల్, బెడ్ కింద దాక్కోవాలి. అలా దాక్కుంటే ఇంట్లోని సామాన్లు వారిపై పడకుండా తప్పించుకోవచ్చు. ఆ సమయంలో గాజు తలుపులు, అద్దాలు, కిటికీల నుంచి దూరంగా ఉండాలి. భూకంపం ఆగే వరకు ఇళ్లలోకి వెళ్లకుండా ఉంటే చాలా మంచింది. కారు లేదా బైక్ నడుపుతున్నట్లయితే, ఆ సమయంలో మీరు కుదుపులకు గురవుతారు. వెంటనే ఆపి కారులో కూర్చోండి. ఇది కాకుండా భూకంపం సమయంలో కొవ్వొత్తులు, అగ్గిపుల్లలు, ఇతర వస్తువులను ఉపయోగించవద్దు.