NTV Telugu Site icon

Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి. సమస్యలేంటీ..?

Manipur

Manipur

Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో అడ్డుడికిపోతుంది. అసలు అలాంటి ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి. అనే కారణాలు, పరిస్థితులపై మాజీ అసోం డీజీపీ, అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పల్లబ్ భట్టాచార్య చర్చించారు. మైతేయిలకు ఎస్టీ హోదా ఇవ్వరాదని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్.. ట్రైబల్ సంఘీభావ ర్యాలీ చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో హింస మొదలైంది. స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి మణిపూర్ లో ఇప్పటి వరకు ఎన్నో పొరపాట్లు, సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Read Also: Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే..!

అందుకు గల కారణాలు, తప్పులు నాలుగు ఉన్నాయి. అందులో మొదటిది.. బ్రిటీష్ ఇండియాలో మణిపూర్ రాష్ట్ర చేరిక జరిగింది. 1930వ దశకం మలి సంవత్సరాల్లో మణిపూర్ సంస్థానం బర్మాలో కాకుండా బ్రిటీష్ పాలిత భారత్‌లో చేరాలని ప్రతిపాదించింది. 1935లో స్వాతంత్ర్య సమరాన్ని బలహీనపరచడానికి బ్రిటీషర్లు భారత్ నుంచి బర్మాను వేరుచేశారు. 1947 ఆగస్టు 11న చేరికపై మహారాజా బుధాచంద్ర సంతకం చేయగా.. 1949 సెప్టెంబర్ 21వ తేదీన విలీన ఒప్పందంపై సంతకం పెట్టారు. ఈ నిర్ణయాన్ని కొన్ని మణిపూర్ గ్రూపులు వ్యతిరేకించాయి. నిర్ణయంపై ఏకాభిప్రాయం రాకముందే విలీనం చేశారని మైతేయి తిరుగుబాటు చేశారు.

Read Also: Tollywood: ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్

రెండో సమస్య.. మణిపూర్ జనాభా 2011 లెక్కల ప్రకారం, 41.39 శాతం హిందువులు, 41.29 శాతం క్రిస్టియన్లు, 8.39 శాతం ముస్లింలు, మిగిలినవారు జైనులు, బుద్ధులు మొదలగువారు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 28.6 లక్షల జనాభా ఉండగా.. ట్రైబల్ జనాభా 11.67 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది క్రిస్టియన్లే ఉన్నారు. మూడో సమస్య ఏంటంటే.. 53 శాతం జనాభా కేవలం లోయలో నివసిస్తున్నారు. వీరికి 40 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే 90 శాతం కొండ ప్రాంతాల ప్రజలను కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 53 శాతం జనాభా గల మైతేయీలు ఆ లోయకే పరిమితం అయ్యారు. ఇది ట్రైబల్ కమ్యూనిటీలు నాగాలు, కుకీల మధ్య ఘర్షణాపూరిత వాతావరణానికి కారణంగా మారింది.

Read Also: Hero Bike: హీరో బైక్ కి USB ఛార్జింగ్…ట్యూబ్‌లెస్ టైర్లు.. దీని ధర తెలిస్తే షాకే..!

ఇక నాలుగో సమస్య విషయానికొస్తే.. మణిపూర్ రీజియన్. దీనికి ఒక వైపు మిజోరం, అసోం, నాగాల్యాండ్‌లు ఉండగా.. మరో వైపు 352 కిలోమీటర్ల చొప్పున మయన్మార్ సరిహద్దు ఉంటుంది. ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ ద్వారా 16 కిలోమీటర్ల మేరకు సరిహద్దులో నివసించే వారు ఎదుటి దేశంలో వీసా లేకుండా వెళ్లడానికి ఆస్కారం ఉన్నది. ఈ సరిహద్దు గుండా కుకీలు చొరబడుతున్నారని, వారి జనాభా పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారని మైతేయీల వాదన. ఇదిలా ఉండగా మైతేయీల ఎస్టీ డిమాడ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు రాష్ట్రానికి ఇచ్చిన ఆదేశాలను జారీ చేసింది. దీంతో మైతేయీలు తమ వాటానూ భుక్తం చేస్తారని, వారి పలుకుబడిపై నమ్మకంతో ట్రైబల్స్ భావించారు. కానీ, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో అధికంగా కుకీలే ఉన్నారని మైతేయీలు తిరిగి వాదిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల కారణంగా అక్కడ హింస చెలరేగినప్పుడు కేంద్రం వెంటనే కట్టడి చర్యలు తీసుకోలేదు. కానీ, ఇప్పుడు వేగంగా పరిస్థితులు అదుపులోకి తెచ్చింది.