Asim Munir nuclear threat: అమెరికా పర్యటనలో పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ అణు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసింది. ఇటీవల అమెరికాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఎందుకు ఆయకు ఇంత బలుపు అని చర్చించుకుంటున్నారు. ఏంటి ఆయన కెపాసిటీ.. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Hyderabad Rains: 24/7 సేవల్లో హైడ్రా.. విధుల్లో 3565 మంది, అణుక్షణం అప్రమత్తం!
పాక్ కెపాసిటీ ఎంతో ఆయనకు తెలుసా..
ప్రవాస పాకిస్థానీయులతో నిర్వహించిన కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ పాల్గొని మాట్లాడుతూ.. తమది అణుశక్తి దేశమని, పాకిస్థాన్ కుంగిపోతే తమతో పాటు సంగ ప్రపంచాన్ని తీసుకెళ్తాం అని అన్నారు. భారత్ ఇటీవల సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన దానిపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు. సింధూ నదిపై భారత్ డ్యామ్ నిర్మిస్తే, 10 మిసైల్స్‌తో దాన్ని ధ్వంసం చేస్తామన్నారు. తమకు మిసైల్స్ కొరత లేదని ప్రేలాపణలు చేశారు.
భారత్ పాక్ మధ్య ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్, సింధు జలాలపై వివాదాలు ఉన్నాయి. భారత్‌లో పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ పాక్‌పై దాడి చేసింది. దీంతో పాక్ దిక్కుతోచని స్థితిలో ఉంది. అమెరికా గడ్డపై పాక్ ఆర్మీ చీఫ్ ఈ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఆయన ఈ సమావేశంలో పాల్గొనడానికి ముందు యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లాతో రిటైర్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఛైర్మన్ డాన్ కైన్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంలో భాగంగా ఈ చర్చలు జరిగాయని పాక్ పేర్కొంది. ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశం తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అణుబెదింపులకు పాల్పడటం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనరేపింది. ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు భారత్‌ను ఉద్దేశించి అన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
మునీర్ ఉద్దేశం ఏమిటి..?
పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. రాజకీయ అస్థిరతలతో సతమతమౌతుంది. ఆసిమ్ మునీర్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. కానీ ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడగించే అవకాశం ఉందని సమాచారం. ఈనేపథ్యంలో ఆయన తన దేశ ప్రజల్లో జాతీయవాద భావాలను రెచ్చగొట్టి ఆర్మీ బలాన్ని చూపించాలని అనుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన భారత్‌ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం ద్వారా అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ఉద్దేశం కనిపిస్తుంది. ఇక రెండేది భారత్‌పై ఒత్తిడి పెంచాలనేది లక్ష్యంగా కనిస్తుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ ఇబ్బందుల్లో పడింది. దీంతో దాడి చేసేందుకు సిద్ధం ఉన్నామని హెచ్చరిస్తూ.. మన దేశాన్ని దౌత్య పరంగా, సైనిక పరంగా ఒత్తిడి పెంచేలా కనిపిస్తుంది. మూడోది అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకోవడం. అమెరికా గడ్డపై మునీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాడు. అమెరికా, చైనా వంటి దేశాల నుంచి పాక్ మద్దతు పొందుతుంది. ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నించారు మునీర్.
READ MORE: Tahawwur Rana: ఉగ్రవాదికి 3 ఫోన్ కాల్స్‌కు పర్మిషన్.. షరతులు వర్తిస్తాయ్..!
