US Elections:170 ఏళ్లుగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మంగళవారం మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి?
- దగ్గర పడిన అధ్యక్ష ఎన్నికల తేదీ
- నవంబర్ 5న రాష్ట్రపతి ఎన్నికలు
- ఆ రోజు మంగళవారం
- గత కొన్నేళ్లుగా మంగళవారమే ఎన్నికలు ఓటింగ్ నిర్వహిస్తున్న యూఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడింది. నవంబర్ 5న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మంగళవారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అమెరికాలో గత 170 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నికలు మంగళవారమే జరుగుతున్నాయి. ఇది 1840 సంవత్సరంలో ప్రారంభమైంది. 1845 సంవత్సరంలో, యూఎస్ కాంగ్రెస్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం నవంబర్ మొదటి వారంలోని మంగళవారం అధ్యక్ష ఎన్నికలకు నిర్ణయించబడింది.
1845కి ముందు ఎన్నికలు ఎలా జరిగాయి?
1845లో ఎన్నికలకు రోజును నిర్ణయించే ముందు.. అమెరికాలోని ప్రతి రాష్ట్రం (యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ హిస్టరీ) డిసెంబర్లో మొదటి బుధవారం కంటే ముందు 34 రోజుల వ్యవధిలో అనుకూలమైన ఏ రోజునైనా ఎన్నికలను నిర్వహించడానికి అనుమతించబడింది. వారి సౌలభ్యం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల తేదీని నిర్ణయించుకోవచ్చు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
మంగళవారం ఎందుకు నిర్ణయించబడింది
దీన్ని అరికట్టేందుకు ఏకరూప ఎన్నికల తేదీని ఖరారు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను పరిశీలించి.. నవంబర్ నెల ఎన్నికలకు అనుకూలమని నిర్ణయించారు. ఎందుకంటే అమెరికాలో దాదాపు అన్ని పంటలు నవంబర్‌కు ముందే పండుతాయి. ఒక విధంగా, రైతులు తమ పని నుంచి విముక్తి పొందారు. ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటారు. నవంబర్ తర్వాత.. తీవ్రమైన శీతాకాలం ప్రారంభమవుతుంది. అయితే నవంబర్ ముందు, వేసవి, వ్యవసాయ కాలంగా పరిగణిస్తారు. అందువల్ల, నవంబర్ నెల ఎన్నికలకు ఉత్తమ నెలగా పరిగణించబడింది.
మంగళవారం నిర్ణయం..
యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు నెల నిర్ణయించబడినప్పుడు.. వారాన్ని నిర్ణయించే వంతు వచ్చింది. మొదట వారాంతంలో ఎన్నికలను నిర్వహించడంపై చర్చ జరిగింది. అయితే చాలా మంది అమెరికన్లు శనివారం-ఆదివారం ప్రయాణించడానికి ఇష్టపడరు. ఆదివారం చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. సోమవారం నాటికి వారంతా కౌంటీకి చేరుకోవడానికి వీలవుతుంది. మంగళవారం ఓటేస్తే బుధవారం అంగడి రోడు హడావిడి లేకుండా పనులు చేసుకోవచ్చు. అయితే, ప్రయాణ సౌకర్యాలు పెరగడంతో మంగళవారం పోలింగ్ నిర్వహించాలనే ఆనవాయితీని మార్చేయాలనే వాదన కూడా జరిగింది. వారాంతం రోజుల్లో పోలింగ్ నిర్వహిస్తే వోటింగ్ శాతం పెరుగుతుందని కూడా వారంటున్నారు. వై ట్యూన్డే అనే బృందం ఒకటి ఈ దిశగా ప్రయత్నాలు చేసింది.
తాజాగా దీనిపై వ్యతిరేకత..
దీనిపై ఓ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం కూడా ప్రారంభించింది. మంగళవారం ఎన్నికలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం వెనుక ప్రధాన వాదన ఏమిటంటే అది పని దినం. ఇలాంటి యువతలో చాలా మందికి పని మధ్య ఓటింగ్ కోసం సమయం దొరకడం కష్టంగా మారిందని పలువురి వాదన. అందుకే ఆ రోజును తీసేసి, మరో రోజు పోలింగ్ నిర్వహించాలని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!