Helmet: బైకుపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదం బారిన పడితే హెల్మెట్ ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువగా తలకు గాయాలైతేనే మరణించే అవకాశం ఉన్నందున హెల్మెట్ వాడాలని అధికారులు చెబుతూ ఉంటారు. అందుకోసం ట్రాఫిక్ పోలీసులు.. హెల్మెట్ వాడాలని చెబుతారు. లేని యెడల ఆ బండికి ఫైన్ విధిస్తారు.
Read Also: Manchu Manoj: ఆదిపురుష్ కోసం మేము కూడా అంటున్న నవదంపతులు
అయితే అసలు విషయానికొస్తే.. మనం వాడే హెల్మెట్లలో చాలావరకు నలుపు రంగులోనే ఉంటాయి.. మీరు గమనించారా..? అలానే ఎందుకుంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు బ్లాక్ కలర్ లో ఉండటానికి కారణమేంటీ.. దాని వెనుకాల ఉన్న సైన్స్ ఏమిటో తెలుసుకుందాం. నిజానికే సైన్స్ అనేదాని కన్నా ఉత్పత్తిదారుల లాభమే అధికంగా ఉంది. హెల్మెట్ తయారీ కంపెనీలు వాటి తయారీలో వినియోగించే ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్ నలుపు రంగులోనే ఉంటాయి. వీటి ప్రాసెస్‌లో వివిధ మెటీరియల్స్ వినియోగిస్తారు. ఫలితంగా పూర్తి మిక్చర్ కలర్ లేదా పిగ్మెంట్ బ్లాక్‌గా మారుతుంది. అయితే కంపెనీల ఖర్చును తగ్గించుకునేందుకు ఈ పిగ్మెంట్‌తోనే హెల్మెట్‌లను తయారు చేస్తాయి.
Read Also: RBI Recruitment 2023: డిగ్రీ అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..రూ.71,032 జీతం..
యువత హెల్మెట్లలో కూడా దాని క్వాలిటీతో పాటు అది స్టైలిష్ గా ఉందా లేదా అని చూస్తారు. దాని దృష్ట్యా హెల్మెట్ కంపెనీలు నలుపు రంగు హెల్మెట్లను తయారు చేస్తాయని కొందరు చెబుతుంటారు. వాహనం నడిపేవారు ఏ రంగు దుస్తులు ధరించినా, వాటికి నలుపురంగు హెల్మెట్ మ్యాచ్ అవుతుంది. దీంతో వారు హుందాగా కనిపిస్తారట. అంతేకాకుండా సాధారణంగా జుట్టు నలుపురంగులోనే ఉంటున్న కారణంగా హెల్మెట్‌ను కూడా నలుపు రంగులోనే తయారు చేస్తారని చెబుతారు. పైగా నలుపురంగు హెల్మెట్లను యువత అత్యధికంగా ఇష్టపడతారని పలు సర్వేలు తెలిపాయి. మరోవైపు హెల్మెట్ ధరించకుండా రోడ్డు ప్రమాదాల్లో 46,593 మంది మృతి చెందినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రత్వశాఖ తెలిపింది.