NTV Telugu Site icon

MI vs CSK: సీఎస్కే వర్సెస్ ముంబై మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి..!

Mi Vs Csk

Mi Vs Csk

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 నేడు (ఆదివారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా, ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్‌లలో 2 గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు, CSK తన ఐదు మ్యాచ్‌లలో 2 మ్యాచ్ లు ఓడిపోయి 3వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ వరుసగా రెండు విజయాలు సాధించి పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఓటమి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ అంతకు ముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

Read Also: Iran Vs Israel: ఇజ్రాయెల్‌పై రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌తో ఇరాన్‌ దాడి..

కాగా, ఐపీఎల్‌లో చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు ఆడాయి. ముంబై 20 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, చెన్నై 16 విజయాలు సాధించింది. అలాగే, వాంఖడే స్టేడియంలో ఎంఐ వర్సెస్ సీఎస్కే మధ్య 11 మ్యాచ్ లు జరగ్గా హార్దిక్ సేన 7 గెలవగా.. గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై నాలుగింటిలో విజయం సాధించింది. అయితే, వాంఖడే స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు చాలా సహాకారిస్తుంది. ఈ స్టేడియం యొక్క బౌండరీలు చిన్నగా ఉండటంతో బ్యాట్స్‌మెన్ ఈజీగా బౌండరీలు బాదే అవకాశం ఉంటుంది. టాస్ గెలిస్తే జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు.. ఎందుకంటే సెకండ్ ఇన్సింగ్స్ సమయానికి డ్యూ ( మంచు ) వచ్చే అవకాశం ఉంటుంది.

Read Also: Israel-Iran War: 17 మంది ఇండియన్స్ ఉన్న ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

ఇక, ఇవాళ (ఏప్రిల్ 14న) ముంబైలో ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, ముంబైలో వర్షం కురిసే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. తేమ స్థాయి 79 శాతం ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గంటకు 19 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.