NTV Telugu Site icon

Renuka Chaudhary: మమల్ని ఆపేది ఎవడ్రా.. పోలీసులకు రేణుకాచౌదరి వార్నింగ్

Renuka Chowdary

Renuka Chowdary

కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహిస్తున్న సభకు బీఆర్ఎస్ ఆటంకాలు సృష్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామనే భయంతో మా సభను ప్రభుత్వం అడ్డుకుంటోంది అని ఆమె సీరియస్ అయ్యారు. రోడ్లపై బారికేడ్లు పెడితే భయపడతామా? మా జాతకాల్లో భయాల్లేవు.. ఎవడబ్బ సొమ్మని పెడుతున్నారు..? పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు.. ఎవడ్రా మమ్మల్ని ఆపేది? అని రేణుకచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ్టి సభ కేవలం ట్రైలరేనని, ముందు ముందు సినిమా చూపిస్తామని రేణుకా చౌదరి అన్నారు.

Read Also: Medico Chaitanya: విషాదం.. పెళ్లైన రెండు నెలలకే మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా?

కాంగ్రెస్ జనగర్జన సభ నేడు ఖమ్మంలో జరుగుతున్న సభకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసి ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు. సాయంత్రం జరుగనున్న సభకు జనాలు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యకర్తలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలను అధికారులు అడ్డుకుంటున్నారని పొంగులేటి కంటతడి పెట్టాడు.

Read Also: Annapurna Photo Studio: రౌడీ హీరో లాంచ్ చేసిన ట్రైలర్…

ఉమ్మడి జిల్లా సరిహద్దులలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు నిన్నటి నుంచే వాహనాలను సీజ్ చేస్తున్నారని రేణుకాచౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె చెప్పారు. సభకు వస్తున్నా.. దాదాపు 1700 ప్రైవేటు వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు రేణుకాచౌదరి తెలిపారు. అయితే, ప్రభుత్వం మాత్రం జనాలను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవద్దని హెచ్చరించింది.