NTV Telugu Site icon

ICC-BCCI: జైషా ఐసీసీ ఛైర్మన్‌ అయితే.. అతని స్థానంలో వచ్చేదెవరు..?

Jay Shah Icc Chairman

Jay Shah Icc Chairman

16 మంది సభ్యులలో 15 మంది అతనికి మద్దతు ఇవ్వడంతో జైషా తదుపరి ఐసీసీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐసీసీలో చేరితే అతడి స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా ఎవరిని నియమిస్తారనే దానిపై స్పష్టత లేదు. అధికారిక నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ కాబట్టి.. జైషా నిర్ణయం తీసుకోవడానికి 96 గంటల కంటే తక్కువ సమయం ఉంది. కాగా.. ఐసీసీ కొత్త చైర్మన్ డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. అక్టోబరు 2025లో అతని పదవీకాలం పూర్తయిన తర్వాత జైషా తిరిగి అత్యంత ధనిక క్రికెట్ బోర్డులోకి రావడానికి తప్పనిసరి మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో.. బీసీసీఐ సెక్రటరీగా ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: TG Vishwa Prasad: గబ్బు పట్టించారు.. ‘మిస్టర్ బచ్చన్’పై టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

రాజీవ్ శుక్లా: బీసీసీఐ పదవులను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని.. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు శుక్లాను ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగించాలని కోరవచ్చు. బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌లు రబ్బర్‌ స్టాంప్‌ల వంటివారు కాబట్టి సెక్రటరీగా మారేందుకు శుక్లాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు.

ఆశిష్ షెలార్: మహారాష్ట్ర బీజేపీ అనుభవజ్ఞుడు షెలార్. అతను బీసీసీఐ కోశాధికారి, MCA పరిపాలనలో మంచి పేరు ఉంది. ఈ క్రమంలో.. షెలార్ ప్రభావవంతడు కావడంతో అతను కూడా రేసులో ఉండొచ్చు.

అరుణ్ ధుమాల్: ఐపీఎల్ ఛైర్మన్‌కు బోర్డును నిర్వహించడానికి అవసరమైన అనుభవం అరుణ్ ధుమాల్ కు ఉంది. అతను కోశాధికారిగా ఉన్నాడు.. అంతేకాకుండా, క్యాష్ రిచ్ లీగ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. వీరితో పాటు.. రోహన్ జైట్లీ, అవిషేక్ దాల్మియా, దిల్షేర్ ఖన్నా, విపుల్ ఫడ్కే మరియు ప్రభతేజ్ భాటియా వంటి యువ నిర్వాహకులు కూడా ఉన్నారు. అయితే.. బీసీసీఐ యొక్క అధికార నిర్మాణం సాధారణంగా వ్యవస్థలో ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుందని.. కొత్తవారికి ఉన్నత ఉద్యోగం పొందడం అసాధ్యం అని బీసీసీఐ మాజీ కార్యదర్శి అన్నారు.