NTV Telugu Site icon

Game Changer : “గేమ్ ఛేంజర్” హెచ్ డీ లీక్ భాద్యులు ఎవరంటే ?

Gamechanger,

Gamechanger,

Game Changer : మెగా ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారన్న సంగతి అర్థం అవుతుంది.

Read Also: Nimmala Ramanaidu: వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదు.. ఆ సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం..

ఇక ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఊహించని విధంగా సోషల్ మీడియాలో పైరసీలా కాదు.. ఏకంగా ఫుల్ హెచ్ డీ క్లారిటీ ప్రింట్ బయటకు వచ్చేసింది. ఇటీవల పుష్ప 2 కి కూడా కొన్ని రోజులు తర్వాత వచ్చింది.. కానీ ఇలా రిలీజ్ రోజే ఒక పెద్ద సినిమా ప్రింట్ బయటకు అది కూడా ఫుల్ క్లారిటీతో బయటకి రావడం అనేది షాకింగ్ విషయమనే చెప్పాలి. మరి ఇది చూసిన మెగా అభిమానులకు ఒకింత షాక్ కు లోనవ్వగా దీనికి అసలు కారకులెవరు అని వారిస్తున్నారు.

Read Also: Pakistan: ‘‘పారిస్ మేం వస్తున్నాం’’.. నవ్వుల పాలైన పాక్ ఎయిర్‌లైన్స్ పోస్ట్‌..

చిత్రయూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి లీక్ వచ్చినప్పటికీ ఇంకా ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. రెండు మూడు వారాలు తర్వాత ఫుల్ క్లారిటీ ఉన్న సినిమా ప్రింటులు లీక్ అవుతున్నాయంటే ఇప్పుడు ఏకంగా రిలీజ్ రోజునే ప్రింట్ లు లీక్ అవ్వడం అది కూడా హెచ్ డీ ప్రింట్ మళ్ళీ మొదలైంది. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారో బాధ్యులు ఎవరనే విషయాన్ని సినీ పెద్దలు సీరియస్ గా తీసుకుని పరిశీలించాల్సిన అంశమనే చెప్పుకోవాలి.

Show comments