NTV Telugu Site icon

Radhika merchant: అంబానీకి కాబోయే చిన్న కోడలు గురించి ఈ విషయం తెలుసా!

Radhika

Radhika

గత కొద్ది రోజులుగా ముకేష్ అంబానీ ఇంట్లో జరగబోయే పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. త్వరలో చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది. ఎంతో గ్రాండ్‌గా గతేడాది జనవరి 19న నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఆ ఫ్యామిలీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వచ్చే జూలై 12న జరగనుంది. కానీ దానికంటే ముందే ప్రీ వెడ్డింగ్ వేడుకల పేరుతో మూడు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు గుజరాత్ జామ్‌నగర్ వేదికైంది. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేర్లు, ఆయా కంపెనీల సీఈవోలు, సినీ, రాజకీయ, క్రీడాకారులను, పలువురు వీవీఐపీలను ఆహ్వానించారు.

ఇదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు ముకేష్ అంబానీ కోడలి గురించే చర్చ జరగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ముకేష్ ఒకరు. పైగా భారతీయ అపర కుబేరుడు. మరీ ఆ కుటుంబానికి కాబోయే కోడలంటే ఎంతో స్పెషల్ ఉంటుంది కదా?, అంత పెద్ద కుటుంబానికి కోడలు అవుతుందంటే మామూలు విషయం కాదు. అందుకే ఆమె గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది. అసలు ఆమె ఎవరు?, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ముకేష్-నీతా దంపతులకు కాబోయే చిన్న కోడలు ఎవరో.. ఏంటో తెలిసేసుకుందాం.

అసలు రాధిక మర్చంట్ ఎవరు?
రాధికా మర్చంట్ డిసెంబర్ 18, 1994న ముంబైలో వీరేన్ మర్చంట్-శైలా మర్చంట్ దంపతులకు జన్మించారు. వీరేన్ మర్చంట్ ప్రఖ్యాత ఫార్మాస్యూటికల్ సంస్థ అయిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో.

రాధిక ది కేథడ్రల్-జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్‌లో విద్యాభాస్యం చేశారు. అలాగే BD సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా పట్టా పొందారు. అనంతరం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ మరియు ఎకనామిక్స్‌ను అభ్యసించారు. 2017లో గ్రాడ్యుయేట్ అయ్యారు.

అనంతరం ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఇస్ప్రవాలో జూనియర్ సేల్స్ మేనేజర్‌గా పని చేశారు. అంతకంటే ముందుగా దేశాయ్ & దివాన్జీ కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్‌షిప్‌తో తన వృత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

నృత్యకారిణి..
రాధికా కూడా కాబోయే అత్తగారు నీతా అంబానీలా భరతనాట్యం నృత్యకారిణి. దీంట్లో మంచి ప్రావీణ్యం ఉంది. ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ అకాడమీలో గురు భావన థాకర్ ఆధ్వర్యంలో భరతనాట్యం నేర్చుకున్నారు. ఇక 2022లో జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేడుకలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించింది. ఈ నాట్యం చూసిన వారంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా ఇరు కుటుంబాలు దగ్గరయ్యారు.

2023, జనవరి 19న ముంబైలో అనంత్-రాధిక నిశ్చితార్థం జరిగింది. జూలై 12న వివాహం ద్వారా ముంబైలో ఒక్కటి కాబోతున్నారు. అయితే దీని కంటే ముందుగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్ జామ్‌నగర్‌లో నిర్వహిస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన అతిరథమహరథులంతా హాజరవుతున్నారు. ఇకపోతే జామ్‌నగర్ సమీపంలో ఉన్న గ్రామస్తులకు ప్రత్యేక విందులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Show comments