Site icon NTV Telugu

Sankrantiki Vastunnam : బుల్లి రాజా కోసమైనా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు పోవాల్సిందే

New Project (5)

New Project (5)

Sankrantiki Vastunnam : ఈ సారి టాలీవుడ్ సంక్రాంతి సందడి పెద్దగా లేదనే చెప్పాలి. కేవలం మూడు సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో నిల్చున్నాయి. ఈ తెలుగు సినిమాల సందడి ముగిసింది. జనవరి 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాగా, జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలు వచ్చాయి. జనవరి 14న విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రిలీజ్ అయ్యింది. లేటుగా వచ్చినా ముందు వచ్చిన రెండు సినిమాల కంటే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ సంక్రాంతి 2025 విన్నర్‌గా నిలిచింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. ఈ సినిమా రిలీజ్‌కి ముందే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్స్ బోర్డులు పెట్టారు. రిలీజ్ తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టాక్ రావడంతో జనవరి 15న కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి మంచి బుకింగ్స్ వచ్చాయి. సాధారణంగా వెంకీ నటించే సినిమాల్లో అటెన్షన్ అంతా తనకే దక్కుతుంది.

Read Also:Manchu Manoj: మోహన్‌బాబు వర్సిటీకి మంచు మనోజ్‌.. MBU దగ్గర టెన్షన్‌, టెన్షన్‌..!

‘F2’ మూవీలో యంగ్ హీరో వరుణ్ తేజ్‌ని పూర్తిగా డామినేట్ చేశాడు వెంకీ మామ.. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మాత్రం వెంకటేశ్ కొడుకు ‘బుల్లిరాజా’గా నటించిన బుడ్డోడు ఫస్టాఫ్‌లో పూర్తిగా డామినేట్ చేశాడు. బుల్లిరాజా సీన్లకు థియేటర్లలో నవ్వుల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఎవరీ బుల్లిరాజా.. బుల్లి రాజుగా నటించిన కుర్రాడి పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత ఈ బుడ్డోడు, టాలీవుడ్‌లో భారీగా అవకాశాలు దక్కించుకోవడం ఖాయం. మాస్టర్ భరత్ తర్వాత నవ్వించే చైల్డ్ ఆర్టిస్ట్‌లు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు రేవంత్‌, అప్పటి భరత్ ప్లేస్‌ని రిప్లేస్ చేయగల బుల్లి కమెడియన్‌గా కనిపిస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకీకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, తన తర్వాత సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా బుల్లి రాజు రేవంత్‌కి కూడా ఓ మంచి పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.

Exit mobile version