NTV Telugu Site icon

WHO: కరోనా కొత్త వేరియంట్ చాలా ప్రమాదం.. జాగ్రత్తలు తప్పనిసరి..!

Who

Who

గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. అయితే, ఇప్పటికే మూడు వేవ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కరోనా తొలి రెండు వేవ్‌లో మరణాల సంఖ్య విపరీతంగా ఉందని చెప్పింది. తాజాగా కేరళలో మరో కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 బీఏ –2.86 ఉప జాతిరకం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల మళ్లీ ఆందోళన పడుతున్నారు. చలికాలంలో ఈ వేరియంట్‌ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Weather Update : భారీగా పెరిగిన చలి.. ఈ రాష్ట్రాల్లో 10మందికి పైగా మృతి

అయితే, కోవిడ్ JN.1 (కోవిడ్ న్యూ సబ్-వేరియంట్) యొక్క కొత్త సబ్-వేరియంట్ కేరళలో బయటపడింది. ఈ ఇన్‌ఫ్లుఎంజా లాంటి వ్యాధులను పర్యవేక్షించి.. నివేదికను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇదిలా ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవిడ్-19 యొక్క కొత్త సబ్-వేరియంట్ JN.1ని ఆసక్తి వేరియంట్ గా వర్గీకరించింది. అయితే దీని వల్ల ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని చెప్పింది. ఇప్పటికే కోవిడ్ JN.1 యొక్క కొత్త ఉప-వేరియంట్ వల్ల కలిగే ప్రపంచ ప్రజారోగ్య ప్రమాదం ప్రస్తుతం తక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేష్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌లు JN.1, కోవిడ్-19 వైరస్ యొక్క ఇతర వేరియంట్ల వల్ల సంభవించే వ్యాధి వ్యాప్తి మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కోవిడ్-19, జెఎన్.1 ఉప-వేరియంట్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయిని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.