Bird Flu: బర్డ్‌ఫ్లూతో తొలి మరణం.. ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Health Organization: బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డయేరియా, వాంతుల లాంటి లక్షణాలతో హస్పటల్ లో చేరిన 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 24వ తేదీన మరణించినట్లు మెక్సికో తమకు సమాచారం ఇచ్చినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. పౌల్ట్రీ, జంతువుల వద్దకు బాధితుడు వెళ్లిన ఆధారాలు కూడా లేవని చెప్పింది. అయితే, ఆయనకు ఫస్ట్ నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.. వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని ఆరోగ్య సంస్థ పేర్కొంది.
Read Also: Pinnelli Ramakrishna Reddy: నేటితో ముగియనున్న పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు..
Also Read
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
కాగా, ఏవియన్ ఫ్లూ లక్షణాలు బయటపడడానికి ముందే బాధితుడు మూడు వారాల నుంచి అనారోగ్యం పాలైనట్లు అధికారులు తెలిపారు. అతడికి వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది అనేది ఇంకా గుర్తించలేకపోయారు. మెక్సికోలో పౌల్ట్రీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారు. అయితే అక్కడి నుంచి మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొనింది. మరోవైపు బర్డ్‌ఫ్లూలోనే మరో వేరియంట్ హెచ్5ఎన్1 అమెరికా డెయిరీల్లో వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ పని చేస్తున్న కొంత మందికి ఇది సోకినట్లు నిర్ధరించుకున్నారు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు నిర్ధరణ చేయలేదు.
అయితే, ఇటీవల భారతదేశంలోని పక్షులు, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవించడంపై అలర్ట్ గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పశు సంవర్థక విభాగంతో పంచుకోవాలని పేర్కొనింది. దీని వల్ల ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రజారోగ్య కార్యాచరణను చేపట్టవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!