Site icon NTV Telugu

Lok sabha election: చివరి దశ పోలింగ్‌లో ఉన్న ప్రముఖులు వీరే..!

Kele

Kele

శనివారం దేశ వ్యాప్తంగా చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం జరగబోయే పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

శనివారం వారణాసితో పాటు యూపీలో 13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు బిహార్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు.. పశ్చిమ బెంగాల్‌లోని 9 లోక్ సభ సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. అటు జార్ఖండ్ రాష్ట్రంలోని 3 స్థానాలు.. పంజాబ్‌లోని 13 లోక్ సభ సీట్లు.. హిమాచల్ ప్రదేశ్‌లోని 4 లోక్ సభ సీట్లు.. ఒడిషాలోని 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగర్‌కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.

ఇది కూడా చదవండి: Arabian Restaurant: పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసం

ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా వారణాసి నుంచి ప్రధాని మోడీ బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మూడోసారి బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ సాధిస్తామని మోడీ ప్రకటించారు. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. ఇక కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ పాటలీపుత్ర, నటుడు రవి కిషన్ గోరక్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు.

ఏప్రిల్ 19న మొదటి దశతో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశలో 102 లోక్‌సభ స్థానాలకు.. రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. థర్డ్ ఫేజ్‌లో 92 లోక్‌సభ స్థానాలు.. నాలుగో దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి 92 లోక్‌సభ స్థానాలు..ఐదో దశలో 49 లోక్ సభ సీట్లు.. ఆరో దశలో 58 లోక్‌సభ సీట్లుకు ఎన్నికలు జరిగాయి. ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ సీట్లకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు నెలలకు పైగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Purandeswari: కేంద్ర ప్రభుత్వం ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ. 60 వేల కోట్లు ఇచ్చింది..

Exit mobile version