మ్యాగీ, నూడిల్స్ అంటే అందరు లోట్టలెసుకుంటూ తింటారు.. నగరాల నుంచి గ్రామాల వరకు ఈ వంటకం ఫెమస్ అయ్యింది. రకరకాల వెరైటీ కంపెనీలు కూడా ఉన్నాయి..ఇది చాలా రుచికరమైన వంటకం. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు, ఇంటి నుండి దూరంగా నివసించే వారికి ఇది చాలా మంచి వంటకం. ఇది కేవలం కొన్ని నిమిషాల్లో తయారు చేయబడుతుంది. వెంటనే ఆకలిని తీర్చుతుంది. ఇన్స్టెంట్ నూడుల్స్‌ను ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడతారు.. అందుకే వీటికి మార్కెట్ మంచి డిమాండ్ కూడా ఉంది.. అలాంటి నూడుల్స్ తో ఓ వ్యక్తి వింత ప్రయోగం చేశాడు..ఈ వింత ప్రయోగం నెట్టింట హాట్ హాట్‌గా మారిపోయింది. ఎలా చేశాడో ఓ లుక్ వేద్దాం పదండీ..
Read Also:Mrunal Takur : హాట్ స్పాట్ కనిపించేలా పోజులు.. సినిమా కోసం ఇంత తెగింపా?
ఇందులో నీళ్లకు బదులు విస్కీని ఉపయోగించి నూడుల్స్‌ను తయారు చేస్తున్న ఓ వ్యక్తి వీడియో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియా యూజర్లలో ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇందుకు సంబందించిన వీడియో పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా వింత కామెంట్స్ చేస్తున్నారు.. నూడుల్స్ ప్రియులు మాత్రం మండిపడుతున్నారు.. తాము ఎంతో ఇష్టంగా తినే నూడుల్స్‌లో ఆల్కహాల్‌ను కలపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది అనుచితమైన లేదా అనారోగ్యకరమైన ఎంపిక అని అడుగుతున్నారు.. ఇది తింటే టేస్ట్ ఏమో గానీ ఘోస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు..
Read Also:Manipur : మణిపూర్‌లో దారుణం.. అంబులెన్సుకు నిప్పు.. చిన్నారితో సహా నలుగురు మృతి..
నిజానికి ఈ వీడియో ను చేసిన వ్యక్తి మ్యాగీని విస్కీ తో చేస్తారు.. అయితే నీటితో వేడి చేస్తే, ఆల్కహాల్ గాలిలోకి ఆవిరైపోతుందని, మిగిలిన నీటిని మ్యాగీ తయారీకి ఉపయోగించవచ్చని యష్ చెప్పాడు. ఈ ప్రయోగాలు చేస్తూనే తన వీడియోలో కూడా చూపించాడు. నూడుల్స్ చేసిన తర్వాత తిని చూసి అందులో ఆల్కహాల్ మిగిలి ఉందా లేదా అని చెప్పాడు.. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వింత వంటలు దర్శనం ఇస్తున్నాయి.. విస్కీ మ్యాగీకు సంబందించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో చూడవచ్చు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంది..