Site icon NTV Telugu

World Cup 2023 Final: ఫైనల్ పోరులో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువున్నాయంటే..!

Pridictions

Pridictions

వరల్డ్ కప్ 2023 ఫైనల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఈ మెగా టోర్నీ చివరిపోరులో ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితం రావాలంటే ఒక్కరోజు వేచిచూస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపించింది. ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి ఫైనల్కు చేరుకుంది. ఇక ఫైనల్స్ లోనూ ఇదే జోరు చూపించి టైటిల్ గెలువాలని భారత అభిమానులు కోరుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. అన్ని మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అంతేకాకుండా.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.

Read Also: Virat Kohli: పరుగుల రారాజుకు అరుదైన గౌరవం.. జైపూర్లో కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు

ఈ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉండనుంది. కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం.. టీమిండియా ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభించి.. ఆ తర్వాత ఎదురుదెబ్బలను ఎదుర్కొంటుందని తెలుపుతున్నారు. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పుతాడని.. ఫైనల్ మ్యాచ్లో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషిస్తాడనే అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్ల పాత్ర చాలా కీలకం కానుంది. స్పిన్ బౌలర్ల పాత్ర చాలా బలంగా ఉంటుందని అంచనా.

Read Also: Malreddy Rangareddy: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం..

ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్‌లో వాతావరణం కొంత ప్రభావాన్ని చూపుతుంది. వాతావరణం కారణంగా ఆటను నిలిపివేయకపోతే.. ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ దూకుడుగా ఆడనున్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇక.. మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ ప్రపంచకప్ ను భారత్‌ సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రిడిక్షన్స్ చెబుతున్నాయి.

Exit mobile version