NTV Telugu Site icon

Off The Record : కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు.?

Bjp Otr

Bjp Otr

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడు? అసలా విషయంలో పార్టీ హై కమాండ్‌ సీరియస్‌గా ఉందా? లేదా? మిగతా రాష్ట్రాల్లో నియామకాలు చేస్తున్న బీజేపీ పెద్దలకు తెలంగాణ ఎందుకు కొరుకుడు పడటం లేదు? అసలా విషయంలో ఏం జరుగుతోంది? కేడర్‌ మనోగతం ఏంటి? అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనలాగే… వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కూడా…ఈసారి కేంద్ర కేబినెట్‌ బెర్త్‌లు దక్కాయి. ఒక వ్యక్తికి ఒకటే పదవి అన్నది పార్టీ పాలసీ. దాని ప్రకారం కేంద్ర మంత్రులుగా జోడు పదవుల్లో ఉన్న వారిని రాష్ట్ర అధ్యక్షులుగా తప్పించి కొత్తవారిని నియమిస్తూ వస్తోంది అధిష్టానం. కానీ.. తెలంగాణలో మాత్రం ఆ ఛాయలు కూడా కనిపించడం లేదు. కనీసం ఇప్పట్లో కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందా లేదా అన్న క్లారిటీ పార్టీ వర్గాలకు లేదు. దీంతో రాష్ట్రం విషయంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. పార్టీ పెద్దలతో కాస్త పరిచయం ఉన్న ఎవర్ని కదిపినా… త్వరలోనే అన్న మాట తప్ప…ఆ త్వరలో ఎప్పుడు వస్తుందన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. సంస్థాగత ఎన్నికలు అయ్యే వరకు కొత్త అధ్యక్ష నియామకం ఉండదన్న ప్రచారం ఓవైపు, త్వరలోనే అన్న మాటలు మరోవైపు పార్టీ కేడర్‌ని కన్ఫ్యూజ్‌ చేసేస్తున్నాయట. కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్చార్జిగా ఉన్నారు.

MESC : సినిమా టెక్నికల్ అసిస్టెంట్లకు ట్రైనింగ్.. ఎలా తీసుకోవాలంటే?

ఆ వత్తిడిలో ఆయన తెలంగాణ పార్టీ రోజువారీ వ్యవహారాల మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పక్షాలు. బీజేపీ కేడర్‌ కూడా అదే ఊపులో ఉండటంతో పాటు… పార్టీ అగ్రనాయకత్వపు ప్లానింగ్‌ ఎలా ఉండబోతోందని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కానీ… రెగ్యులర్ మానిటరింగ్ లేక పోవడంతో కేడర్‌లో స్తబ్దత పెరుగుతోందట. ఎలాగూ కొత్త అధ్యక్షుడు వస్తారు కదా.. అని కిషన్ రెడ్డి పెద్దగా పట్టించుకోకపోవడం, ఆ కొత్త అధ్యక్షుడు రాకపోవడంతో… దిశానిర్దేశం లేక నాయకులంతా ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారన్న చర్చ జరుగుతోది పార్టీ వర్గాల్లో. అటు బీజేపీ హై కమాండ్ కూడా కొత్త వారిని నియమించాలనే ఆలోచనతో ఉన్నా… ఎవరన్న విషయంలో క్లారిటీకి రాలేకపోతోందట. పార్టీలో కొత్త పాత లొల్లి నడుస్తోంది. ఆ క్రమంలో ఎనరికి వారే గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి సంఘ్‌ పరివార్‌ పెద్దలతో పైరవీలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ గందరగోళంలో ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో…ఎంపిక ఆలస్యం అవుతోందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణకు పార్టీ ఇన్చార్జి కూడా లేరు. ఆ నియామకం విషయంలో సైతం తాత్సారం చేస్తోంది అధిష్టానం. ఇటీవల పెండింగ్‌లో ఉన్న కొన్ని రాష్ట్రాలకి ఇంఛార్జ్‌లను నియమించినా… తెలంగాణను మాత్రం పక్కన పెట్టారు. దీంతో అధ్యక్ష పదవి సరే…. కనీసం ఇన్ఛార్జ్‌ని నియమించడానికి వచ్చిన సమస్య ఏంటన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఈ రెండు పదవుల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుంటే… స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్‌ తప్పదన్న వార్నింగ్స్‌ వస్తున్నాయి కేడర్‌ నుంచి. మరి పార్టీ పెద్దలు ఈ విషయాన్ని చెవికెక్కించుకుంటారో లేక లైట్‌ తీసుకుంటారో చూడాలంటున్నారు పరిశీలకులు.

MESC : సినిమా టెక్నికల్ అసిస్టెంట్లకు ట్రైనింగ్.. ఎలా తీసుకోవాలంటే?