రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్ ‘.. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వచ్చిన సినిమా మాత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది. విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది..
సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.. విడుదలకు ముందు ఉన్న వచ్చిన క్రేజ్ తర్వాత సినిమాకు లేదనే టాక్ ను అందుకుంది.. రొటీన్ స్టోరీ, కథనం కూడా కొత్తగా లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో అనుకున్న హిట్ ను అందుకోలేక పోయింది.. కలెక్షన్స్ కూడా పర్వాలేదనిపించాయి… ఇక సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మే 3 నుంచి స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారని గతంలో వార్తలు వినిపించాయి. కానీ నెలలోపే ఈ సినిమాను ఓటీటీలోకి రాబోతుందని టాక్.. ఈ నెల 26న ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి రానుంది. కేవలం 20 రోజులకే ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను విజయ్ లైనప్ లో పెడుతున్నారు.. ఇప్పటికే మూడు సినిమాలు లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది…