Site icon NTV Telugu

Jailer : జైలర్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2023 11 06 At 11.27.25 Pm

Whatsapp Image 2023 11 06 At 11.27.25 Pm

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.. ఈ సినిమా ఆగస్టు 10 న థియేటర్స్ లో విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తం గా భారీ కలెక్షన్స్ రాబట్టింది.. అదేవిధంగా జైలర్ మూవీ ఓటీటీ లో కూడా అదరగొట్టింది.. ఇదిలా ఉంటే ఈ మూవీ టీవీ లో టెలికాస్ట్ కాబోతుంది… బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా దీపావళి సందర్భం గా టీవీలో రాబోతోంది.తెలుగు, తమిళ, కన్న వెర్షన్ల లో ఒకేసారి టెలికాస్ట్ కానుండగా.. హిందీ వెర్షన్ మాత్రం ఒక రోజు ముందుగానే రానున్నట్లు సదరు ఛానెల్స్ వెల్లడించాయి.జైలర్ మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 12న సాయంత్రం 6.30 గంటలకు జెమిని టీవీలో రానుంది. ఇక తమిళ వెర్షన్ అదే రోజు అదే సమయానికి సన్ టీవీలో, కన్నడ వెర్షన్ ఉదయ టీవీలో వస్తాయి.

జైలర్ హిందీ వెర్షన్ మాత్రం నవంబర్ 11న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్ ఛానెల్లో టెలికాస్ట్ కాబోతుంది.. అయితే . మలయాళం వెర్షన్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రజనీకాంత్ తోపాటు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా, రమ్య కృష్ణ మరియు సునీల్ నటించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ సినిమాకే మేజర్ హైలైట్ గా నిలిచింది.జైలర్ చిత్రంలో రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్ర లో రజినీకాంత్ నట విశ్వరూపం చూపించారు.. ఈ సినిమాలో ఆయన యాక్షన్, స్టైల్, స్వాగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు.థియేటర్, ఓటీటీ లో అదరగొట్టిన జైలర్ మూవీ టీవీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి..

Exit mobile version