Henry Kissinger: హెన్రీ కిస్సింజర్ ప్రఖ్యాత అమెరికన్ దౌత్యవేత్త. ఇందిరాగాంధీ హయాంలో భారత్-అమెరికా బంధాల్లో విభేదాలకు సాక్ష్యంగా ఉన్నారు. కిస్సింజర్ 100 ఏళ్ల వయసులో అమెరికాలో మరణించారు. అయితే ఇందిరాగాంధీపై కోపంతోనే అమెరికా, చైనాకు దగ్గరైందనే వాదని ఉంది. ఈ రెండు దేశాల సంబంధాల్లో కిస్సింజర్ ప్రముఖ పాత్ర వహించారు. తాజాగా మోడీ నాయకత్వంలో భారత్‌తో బంధాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశించారు.
అయితే కోల్డ్ వార్ సమయంలో, 1972 బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో భారత్‌తో అనేక విభేదాలకు కారకుడనే అపవాదును ఎదుర్కొన్నారు. 1971లో అప్పటి యూఎస్ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, విదేశాంగ కార్యదర్శి హన్రీ కిస్సింజర్‌తో భేటీ అయ్యారు. వీరి సంభాషణల్లో ఇందిరాగాంధీని తీవ్ర పదజాలంతో దూషించడం, ఆమెను B***h అంటూ తిట్టడంతో పాటు భారతీయును అగౌరపరిచే విధంగా దూషించడం ఇప్పటికీ మరిచిపోలేము. భారతీయలుపై నిక్సన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యాల్ని టేపులు బహిర్గతం చేశాయి. ఈ వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లడంతో కిస్సింజన్ తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, శ్రీమతి ఇందిరాగాంధీని గౌరవిస్తున్నానని క్షమాపణలు చెప్పారు.
బంగ్లా యుద్ధ సమయంలో పాక్‌కి మద్దతు:
భారత్ ఉపఖండంలో సోవియట్ రష్యా ప్రభావం పెరగడాన్ని అమెరికా సహించలేకపోయింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారత్‌ని కాదని అమెరికా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపింది. తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్) విమోచన సమయంలో అమెరికా, పాకిస్తాన్‌కి సాయపడింది. ఓకానొక దశలో భారత్ పైకి బ్రిటన్, యూఎస్ తన యుద్ధ వాహక నౌకల్ని పంపింది. దీనిని ప్రతిఘటించేందుకు రష్యా భారత్‌కి అండగా నిలిచి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించింది. బంగ్లాదేశ్ విముక్తి తర్వాత.. కిస్సింజర్, యూఎస్ అధ్యక్షుడు నిక్సన్‌తో మాట్లాడుతూ.. తాను ‘‘పశ్చిమ పాకిస్తాన్’’ ఇప్పటి పాకిస్తాన్‌ని రక్షించానని చెప్పారని కొన్ని పత్రాలు వెల్లడించాయి.
