ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ తన ఖాతాదారుల కోసం పేమెంట్స్ ఫీచర్ ను కాస్త మరింత సులభతరం చేసింది. ఇందుకు గాను క్యూఆర్ కోడ్ స్కానర్ ను చాట్ లిస్ట్ లోనే కనిపించే విధంగా మార్పులను తీసుకువచ్చిందివాట్సాప్. నిజానికి వాట్సాప్ తన యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి సేవలను ప్రారంభించి చాలా రోజులే అయినప్పటికీ.. కాకపోతే., ఆశించిన స్థాయిలో మాత్రం దానికి ఆదరణ లభించలేదు.
Also read: IPL 2024: అదే జరిగితే.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’గా హార్దిక్ పాండ్యా!
నిజానికి వాట్సాప్ యూజర్లు కేవలం చాట్, స్టేటస్‌లు చూసేందుకు, ఇంకా ఆడియో లేదా వీడియో కాల్స్ చేసుకునేందుకు మాత్రమే వాట్సప్ ను ఎక్కువగా వాడుతున్నారు. కాకపోతే.. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను మాత్రం ఎక్కువగా వాడడంలేదు. దీనిని గుర్తించి తమ యూజర్లను చేరుకునేందుకు వాట్సాప్ సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఈ కారణం చేత యూపీఐ పేమెంట్స్ ఫీచర్ ను చాలా సులభతరం చేసింది వాట్సాప్.
Also read: Mamitha Baiju : రెమ్యూనరేషన్ ను పెంచేసిన ప్రేమలు హీరోయిన్?
నిజానికి వాట్సప్ పేమెంట్స్ చేయాలంటే.. వాట్సాప్ లో కనపడే త్రీ డాట్స్ లోకి వెళ్లి, అక్కడ పేమెంట్స్ మెనూ ఓపెన్ చేసి చెల్లింపులు చేయాల్సిన పని. దాంతో ఈ అప్షన్ ను యూజర్లు వాడడానికి ఇష్టపడడట లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ ఇక పై చాట్ లిస్ట్ లోనే క్యూఆర్ కోడ్ ను ఉంచబోతుంది. తద్వారా సింపుల్ గా పేమెంట్స్ చేయడానికి వీలు కలుగుతుంది. ఇందుకు కోసం కొత్త బీటా వర్షన్ లో వాట్సప్ బ్యానర్, కెమెరా సింబల్ మధ్యలో కొత్తగా ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ను తీసుకరాబోతున్నారు. ఇలా మనం అతి సులువుగా.. వాట్సాప్ యూపీఐకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ద్వారా నేరుగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.., మిగతావారికి దశలవారీగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకరాబోతున్నారు.