ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. యూజర్ల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇమేజ్‌ల మూలాలను గుర్తించేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని చిత్రాల కోసం ‘సెర్చ్ ఆన్ వెబ్’ (Search on web) ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు.
వాట్సాప్‌లో నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేసే ఆప్షన్ లేదు. ఇమేజ్ గురించి సెర్చ్ చేయడానికి ఇతర యాప్ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ సదుపాయాన్ని వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు యాప్ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సప్ ద్వారా షేర్ చేసే కంటెంట్‌కు పారదర్శకతను మెరుగుపరచడమే ఈ ఫీచర్ అసలైన లక్ష్యం. ఇమేజ్ గురించి సెర్చ్ చేయగానే.. దానికి సంబంధించిన మూలం, ఫొటో ఎక్కడి నుంచి వచ్చింది, ఆన్‌లైన్‌లో ఈ ఫొటోను ఎవరైనా వినియోగించారా? అనే డీటెయిల్స్ కనిపిస్తాయి. ఫొటోను ఎడిట్ చేశారా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ముందుగా బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
Also Read: Siva karthikeyan: 21 ఏళ్లుగా జ్ఞాపకాలు.. ఆయన కోసమే ‘అమరన్’ సినిమా చేశా!
స్టెప్స్ ఇవే:
1. వాట్సప్ చాట్‌లో ఇమేజ్‌ని ఓపెన్ చేయగానే.. పైన కుడి వైపున త్రీ డాట్స్ మెనూ కనిపిస్తుంది
2. త్రీ డాట్స్ మెనూను క్లిక్ చేయగానే పలు ఆప్షన్లు కనిపిస్తాయి
3. Search on web ఆప్షన్ క్లిక్ చేయగానే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది
4. అందులో Search ఆప్షన్‌పై క్లిక్ చేసి.. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను స్టార్ట్ చేయొచ్చు