సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. వాట్సాప్ తన కస్టమర్ల కోసం కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ కు వాట్సాప్ అఫీషియల్ చాట్ అని పేరు పెట్టింది.. ఆ ఫీచర్ ను ఎప్పుడో ప్రకటించింది.. కానీ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొని వచ్చారు..
ఈ ఫీచర్‌ని కంపెనీ మార్చి నెలలో ప్రకటించగా.. ప్రస్తుతం బీటా యూజర్ల కు అందుబాటులో ఉంది. అయితే, ఇదిది కొంతమంది యూజర్లను ఉద్దేశించి మాత్రమే విడుదల చేసింది.. ఆండ్రాయిడ్ 2.23.25.20 ఉన్న వాట్సాప్ బీటా యూజర్ల కోసం కంపెనీ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసింది. WabetaInfo ప్రకారం.. యూజర్లు వాట్సాప్ అఫిషియల్ చాట్‌కు సంబంధించి యాప్‌లో లేటెస్ట్ అప్‌డేట్స్ అందుకుంటారు.. వాట్సాప్ తన సైట్లో కొన్ని ఇమేజెస్ ను అందుబాటులో ఉంచింది..
వాట్సాప్ యూజర్లు అఫిషియల్ చాట్‌లను ఆర్కైవ్ చేయవచ్చు. అవసరమైతే బ్లాక్ కూడా చేయవచ్చు. ఈ చాట్ మాన్యువల్‌గా తెరవబడదు. అంటే యాప్‌లో ఈ చాట్ ఫీచర్ కనిపించే వరకు వేచి ఉండాల్సిందే.. అయితే ఈ యాప్ అందరికి అందుబాటులోకి రాదని తెలుస్తుంది.. వాట్సాప్ ఈ ఫీచర్ గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడిచంలేదు. ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి రాదని నివేదికలు చెబుతున్నారు. అయితే, వాట్సాప్ బీటా 2.23.15.10ని అప్‌డేట్ చేసిన యూజర్లు మాత్రమే దీన్ని వాడుతున్నారు.. ఇక భవిష్యత్ లో మరికొన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో వాట్సాప్ ఉంది..