NTV Telugu Site icon

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. కొత్త నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసే ఛాన్స్

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. సెక్యూరిటీ అప్‌డేట్ల విషయంలో ముందుండే కంపెనీ, తాజాగా అన్-నౌన్ ఫోన్ నంబర్స్‌ ను సేవ్ చేయకుండానే.. ఆ నెంబర్ తో డైరెక్ట్ గా చాట్ చేసే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్, iOS స్టేబుల్ వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఇక నుంచి వాట్సాప్ యూజర్లందరూ తెలియని నంబర్లను అడ్రస్ బుక్‌లో సేవ్ చేసుకోకుండానే చాట్ చేసుకునే ఫెసిలిటిని వాట్సాప్ బీటా ఇన్ఫో తీసుకోచ్చింది.

Read Also: CPI Narayana: పవన్ ఓ రాజకీయ బ్రోకర్.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

యూజర్లు ముందు వాట్సాప్‌లో కాంటాక్ట్స్ లిస్ట్‌ ఓపెన్ చేసి.. సెర్చ్ బార్‌లో అన్ నోన్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి శోధించాలి.. ఆ కాంటాక్ట్‌కు వాట్సాప్‌ అకౌంట్ ఉంటే, ఓపెన్ చాట్ బటన్‌పై నొక్కి అప్పుడు ఆ ఫోన్ నంబర్‌తో చాట్ చేసుకోవచ్చు. సేవ్డ్‌ కాంటాక్ట్‌తో చాట్ చేసినట్లే ఆ అన్-సేవ్డ్ నెంబర్ తో కూడా చాటింగ్ చేసుకోవచ్చు. iOS, ఆండ్రాయిడ్ యూజర్లు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. తెలియని నంబర్లతో ఓపెన్ చాట్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని అందరు గమనించాలి.. ఎందుకంటే, వారు స్కామర్ లేదా స్పామర్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ఫీచర్‌ వాడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి తెలియజేస్తున్నారు.

Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీకి కోర్టు సమన్లు జారీ.. ఎందుకంటే?

ఈ ఫీచర్‌తో యూజర్లకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయని వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక పేర్కొంది. జనరల్ గా గుర్తు తెలియని నంబర్‌ల నుంచి కాల్స్‌ వచ్చినప్పుడు యూజర్లు ఫోన్ నెంబర్ సేవ్ చేస్తారు. కానీ.. ఆ తర్వాత వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ చెక్ చేసిన తర్వాత వాటి ఐడెంటిటీ తెలుసుకుంటారు. అయితే తర్వాత ఆ నంబర్‌ను డిలీట్ చేయకపోవచ్చు.. దీంతో తెలియని వ్యక్తులు మీ ప్రొఫైల్ పిక్స్, వాట్సాప్ అప్‌డేట్స్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఇది మీ ప్రైవసీకి భంగం కలిగిస్తుంది. అదే కాంటాక్ట్స్‌ సేవ్ చేయకుండా ఫోన్ నంబర్ కోసం సెర్చ్ చేసి చాట్ ఓపెన్ చేస్తే ఎక్స్‌ట్రా ప్రైవసీ దొరుకుతుంది. అయితే, ఈ ఫీచర్ అప్డేట్ చేసుకోని వారు వెంటనే మీ వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది.