NTV Telugu Site icon

WhatsApp New Feature : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్.. ఫోటో బ్లర్ చేసుకునే ఆప్షన్

Whatsapp Feature

Whatsapp Feature

WhatsApp New Feature : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌ కొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది. ఇటీవల అనేక కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తూ తన మార్కెట్ మరింత పెంచుకుంటుంది. ఈ క్రమంలో డెస్క్ టాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఫోటో బ్లర్ చేసే సదుపాయం కల్పించింది. ప్రస్తుతం ఈ అవకాశం ఇప్పటి వరకు బీటా యూజర్లకు అందుబాటులోకే తెచ్చింది. త్వరలోనే అందరికి ఈ ఫీచర్ అవకాశం కల్పించనుంది. ఇంతకు ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. వాట్సాప్‌ బీటా ట్రాకర్ డబ్ల్యూ బీటా ఇన్ఫో ఈ ఇమేజ్ బ్లర్ టూల్ గురించి వెల్లడించింది. మరింత సెక్యూర్‌గా ఇమేజ్‌లు షేర్ చేసుకునేందుకు ఈ బ్లర్ టూల్ ఉపయోగపడుతుంది. ఫొటోను సెండ్ చేసే ముందు.. ఆ ఫొటోలోని ఏదైనా భాగాన్ని ఈ టూల్ సాయంతో బ్లర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రిసీవర్‌కు ఫొటోలోని ఏదైనా భాగం కనిపించకూడదనుకుంటే.. దాన్ని బ్లర్ చేసి పంపించే సదుపాయం ఈ టూల్ వల్ల వస్తుంది. త్వరలోనే ఇమేజ్ బ్లర్ ఫీచర్‌ను మొబైల్‌ బీటా వెర్షన్‌‌కు కూడా తెచ్చే అవకాశం ఉంది. టెస్టింగ్ పూర్తయ్యాక యూజర్లందరికీ ఈ బ్లర్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. గ్రూప్‌ల నుంచి నిష్క్రమించడం, ఆన్‌లైన్ యాక్టివ్ స్టేటస్‌ను హైడ్ చేసుకోవడం, వ్యూవన్స్ మెసేజ్‌లకు స్క్రీన్‌షాట్స్‌ను బ్లాక్ చేయడం వంటి ఫీచర్లను కూడా త్వరలో వాట్సాప్ తీసుకురానుంది. మరోవైపు వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా 2.22.23.15 వెర్షన్‌తో ఓ కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. మీడియాను క్యాప్షన్‌తో ఫార్వర్డ్ చేసుకునే సదుపాయాన్ని ఇస్తోంది. మరోవైపు యూజర్లందరూ ఎదురుచూస్తున్న ఎడిట్ మేసేజ్ ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తోంది. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని ఇచ్చే ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది.