NTV Telugu Site icon

WhatsApp Update: ఇకపై వాట్సాప్ స్టేటస్లో మ్యూజిక్.. ఎలా పెట్టుకోవాలంటే?

Whatsapp

Whatsapp

WhatsApp Update: తాజాగా వాట్సాప్ మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు స్టేటస్‌లో పాటలను జతచేసే అవకాశం ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా, ఈ ఫీచర్ వాట్సాప్ ను మరింత ఇంటరాక్టివ్, మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రూపొందించబడింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్, త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త అప్‌డేట్ ద్వారా, వినియోగదారులు ప్రముఖమైన పాటలను తమ స్టేటస్‌లో జోడించుకోవచ్చు. ఈ స్టేటస్‌లు ఇతర వాటిలాగే 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా కనపడవు. మెటా ప్రకారం, వాట్సాప్ వినియోగదారులు మిలియన్ల పాటలకు యాక్సెస్ పొందుతారు. స్టేటస్ అప్‌డేట్ చేసే సమయంలో వీడియో, ఫోటో, టెక్స్ట్ వంటి ఆప్షన్లతో పాటు మ్యూజిక్ జతచేసే ఐకాన్ కూడా అందుబాటులో ఉంటుంది.

Read Also: Vivo V50e: అతి త్వరలో స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచేయనున్న వివో V50e

ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మ్యూజిక్ ఫీచర్ మాదిరిగానే, వాట్సాప్ లో కూడా పాటలను స్టేటస్‌లో చేర్చడం చాలా సులభం. దీని కోసం సులువుగా ఈ స్టెప్పులను అనుసరిస్తే సరి.

* వాట్సాప్ ఓపెన్ చేసి ‘Status’ సెక్షన్‌కి వెళ్లండి.

* అక్కడ Add Status ఐకాన్‌పై టాప్ చేసి, మీ గ్యాలరీ నుంచి ఫోటో లేదా వీడియోను ఎంచుకోండి.

* స్క్రీన్ పైన కొత్తగా కనిపించే మ్యూజిక్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి.

* అక్కడ లభ్యమయ్యే పాటల జాబితాలో బ్రౌజ్ చేసి, లేదా మీకు నచ్చిన పాటను సెర్చ్ చేయండి.

* పాటలో మీరు ఉపయోగించదలచుకున్న భాగాన్ని ఎంపిక చేసుకుని ‘Done’ బటన్ నొక్కండి.

* అలా మీ స్టేటస్‌ను పబ్లిష్ చేయండి, అప్పుడు మీ మ్యూజిక్ స్టేటస్ అందరికీ కనిపిస్తుంది.

* వినియోగదారులు ఇమేజ్ స్టేటస్ కోసం 15 సెకండ్ల పాట, అలాగే వీడియో స్టేటస్ కోసం 60 సెకండ్ల పాట ఉంచవచ్చు.

Read Also: Food Colors: ఏ రంగు ఆహారం తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..!

ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. వినియోగదారులు తమకు నచ్చిన పాటలోని ప్రత్యేకమైన భాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ సౌలభ్యంతో వారు ట్రెండింగ్‌లో ఉన్న పాటలను వినియోగించుకోవచ్చు లేదా స్వతంత్రంగా తమ భావాలను కూడా వ్యక్తపరచుకోవచ్చు. అంతేకాకుండా, ఇతర వాట్సప్ కంటెంట్ మాదిరిగానే, మ్యూజిక్ స్టేటస్ అప్‌డేట్‌లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో భద్రతను కలిగి ఉంటాయి. దీని వల్ల వినియోగదారుల ప్రైవసీ మరింత రక్షించబడుతుంది. ఈ కొత్త మ్యూజిక్ ఫీచర్ WhatsApp వినియోగదారులకు మరింత ఆసక్తికరమైన అనుభూతిని అందించడమే కాకుండా, స్టేటస్ అప్‌డేట్‌లను మరింత వ్యక్తిగతీకరించడానికి సహాయపడుతుంది.