WhatsApp In iPad: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPadలో కూడా వాట్సాప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp In iPad: ఆపిల్ ప్రియుల ఇన్నాళ్ల నిరీక్షణకు చెక్ పెడుతూ.. మెటా సంస్థ అధికారికంగా వాట్సాప్ కోసం ప్రత్యేక iPad యాప్‌ను విడుదల చేసింది. దశాబ్దానికి పైగా వినియోగదారులు డిమాండ్ చేస్తున్న ఈ సౌకర్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు iPad వినియోగదారులు వాట్సాప్ వెబ్ ఆధారంగా పరిమిత ఫీచర్లతోనే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు యాప్ స్టోర్ లో ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ ఫర్ iPad యాప్ లభిస్తోంది.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఈ కొత్త యాప్ ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. అలాగే ముందు, వెనుక కెమెరాల మద్దతుతో పాటు.. కాల్ సమయంలో స్క్రీన్ షేరింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఇప్పుడు iPadOS మల్టీటాస్కింగ్ ఫీచర్లను పూర్తిగా వినియోగించుకునేలా రూపొందించబడింది. స్టేజ్ మేనేజర్, స్ప్లిట్ వ్యూ, స్లయిడ్ ఓవర్ వంటి ఫీచర్ల మద్దతుతో ఇతర యాప్‌లతో పాటు వాట్సాప్ ను కూడా ఒకేసారి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వేరే బ్రౌజర్ లో బ్రౌజ్ చేస్తూనే వాట్సాప్ లో మెసేజ్‌కు స్పందించవచ్చు లేదా ఈమెయిల్స్ చెక్ చేస్తూనే కాల్లో కొనసాగవచ్చు.
ఇక మ్యాజిక్ కీబోర్డు, ఆపిల్ పెన్సిల్ వంటివి ఉపయోగించే వారికి ప్రత్యేక మద్దతు ఉంది. దీంతో iPadపై వాట్సాప్ వినియోగదారుల అనుభవం మరింత మెరుగవుతుంది. iPad యాప్ కూడా మెటా మల్టీ-డివైస్ సింక్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది ఐఫోన్ లేకపోయినా వాట్సాప్ యాప్‌ను iPadలో అనుసంధానించుకునే సౌకర్యం కల్పిస్తుంది. ముఖ్యంగా, అన్ని డివైసెస్‌లో మెసేజ్‌లు, మీడియా, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో భద్రంగా ఉంటాయి.
Read Also: TS High Court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్!
iPad యాప్‌లో చాట్ లాక్ అనే ప్రత్యేకమైన భద్రతా ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇతరులతో iPad షేర్ చేసినా, ముఖ్యమైన సంభాషణలను రహస్యంగా ఉంచుకోవచ్చు. ఇక యాప్ విడుదలకు సంబంధించి మెటా సంస్థ స్పందిస్తూ.. ఈ ఫీచర్ కోసం చాలా కాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పూర్తి వాట్సాప్ అనుభవాన్ని iPadకు తీసుకురావడం గర్వంగా ఉందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ గ్లోబల్‌గా అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని ఫీచర్లతో మరింతగా మెరుగుపరుస్తామని మెటా సంకేతాలు ఇచ్చింది.
తాజావార్తలు
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!