NTV Telugu Site icon

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు

Whatsapp New Feauture

Whatsapp New Feauture

WhatsApp: నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ ప్రతి వ్యక్తికి అత్యవసరమైనదిగా మారింది. కాసేపు అది పనిచేయకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. బుధవారం అర్థరాత్రి దాదాపు అరగంట పాటు వాట్సాప్ సర్వీస్ నిలిచిపోయింది. ఆ తర్వాత కంపెనీ తిరిగి సేవలను పునరుద్ధరించింది. ట్విట్టర్‌లో పునరుద్ధరణ గురించి సమాచారం ఇస్తూ, WhatsApp ఇలా పేర్కొంది..‘ మేము తిరిగి వచ్చాము, సంతోషంగా చాటింగ్ చేస్తున్నాము’.

Read Also: Vandebharat: టాయిలెట్ వస్తుందని వందేభారత్ ఎక్కాడు.. టిటి వచ్చి రూ.1000ఫైన్ వేశాడు

మీడియా నివేదికల ప్రకారం, బుధవారం అర్థరాత్రి వాట్సాప్ సేవ అకస్మాత్తుగా నిలిపివేయబడింది. మధ్యాహ్నం 2.14 గంటలకు ట్వీట్ చేయడం ద్వారా వాట్సాప్ ఈ విషయాన్ని తెలియజేసింది. 30 నిమిషాల పాటు సేవలకు అంతరాయం ఏర్పడిందని, మళ్లీ కనెక్టివిటీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తరఫున తెలిపారు. అయితే 20 నిమిషాల తర్వా హ్యాపీ చాటింగ్ సేవలను తిరిగి ప్రారంభించామని కంపెనీ మరో ట్వీట్‌లో తెలిపింది.

Read Also:Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!

వాట్సాప్ సేవ డౌన్ కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా యూజర్లు రెచ్చిపోయారు. వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలను పంపడంలో, టెక్స్ట్ సందేశాలు చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఒక వినియోగదారు తెలియజేశారు. మరోవైపు, మన దేశంలో వాట్సాప్ సేవ నిలిపివేయడం వల్ల కోట్లాది మంది వినియోగదారులు ప్రభావితమయ్యారు. సర్వీసు నిలిపివేత గురించి చాలా ఫిర్యాదులు దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి వచ్చాయి. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, బ్రెజిల్‌లో కూడా వాట్సాప్ సమస్య తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.