Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌కు వీడ్కోలు.. ఈ నెల 8న జస్టిస్‌ లలిత్‌కు చివరి పనిరోజు.. రేపు సెలవుతో ఒక్కరోజు ముందే జస్టిస్‌ లలిత్‌ పదవీ విరమణ

* తెలంగాణలో నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర.

* కామారెడ్డి: మద్నూర్ మండలం మేనూరు వద్ద నేడు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ, ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలిస్తున్న నేతలు

* కామారెడ్డి: నేడు జుక్కల్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర.. రాత్రి సలాబత్‌పూర్‌ వద్ద మహారాష్ట్రలోకి ప్రవేశించనున్న జోడో యాత్ర

* కార్తిక మాసంలో నేడు రెండో సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.. శైవ క్షేత్రాల్లో పెరిగిన భక్తుల రద్దీ..

* ప్రకాశం: కార్తిక సోమవారం సందర్భంగా శైవాలయాల వద్ద భక్తుల రద్దీ.. త్రిపురాంతకం, భైరవకోన, సోపిరాల, ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, పొదిలి శ్రీ నిర్మామహేశ్వరస్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు..

* బాపట్ల : వేటపాలెం నాయనిపల్లిలో శ్రీగంగా పార్వతీ సమేత బోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ్టి నుంచి స్వామి వారిని నేరుగా తాకనున్న సూర్యకిరణాలు.. వారం రోజులపాటు స్వామి వారిని తాకనున్న కిరణాలు.. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో రానున్న భక్తులు..

* కాకినాడ: కార్తీక సోమవారం సందర్బంగా పంచారామాలు వద్ద భక్తుల రద్దీ.. ద్రాక్ష రామము, కుమార రామము భీమేశ్వర స్వామి దేవస్థానాలకు పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజామున నుంచి అభిషేకాలతో పాటు భక్తుల ప్రత్యేక పూజలు, శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవాలయాలు..

* అన్నవరం సత్యదేవుని సన్నిధి లో భక్తులు రద్దీ, కార్తిక సోమవారం సందర్భంగా తెల్లవారుజామునుంచి వ్రతాలు సర్వ దర్శనాలు

* నేడు రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మీడియా సమావేశం.. మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ఉండవల్లి స్పందించే అవకాశం

* కార్తీక పౌర్ణమి కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు.. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, భక్తుల పుణ్య స్నానాలతో కిక్కిరిసిన పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్, స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు

* తూర్పుగోదావరి జిల్లా : నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదికి ప్రత్యేక హారతి.. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరీ నిత్యహారతిలో భాగంగా ప్రత్యేకంగా పౌర్ణమి హారతి

* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి రాజమండ్రిలో సీపీఎం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు.. మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులు

* నేడు ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి రాజమండ్రిలో పర్యటన.. నారాయణపురం గౌతమీ జీవకారుణ్య సంఘంలో ఎంపీ నిధులతో నిర్మించిన హుళ ప్రయోజనకర భవన సముదాయం ప్రారంభం

* అనంతపురం: కార్తీక పౌర్ణమి సందర్భంగా మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం.. శివకోటిలో ప్రత్యేక పూజలు.

* తిరుపతి: కార్తీక సోమవారం సందర్బంగా శ్రీకాళహస్తీ, కపీలతీర్దం వద్ద భక్తుల రద్దీ.. తెల్లవారుజామున నుంచి అభిషేకాలతో పాటు భక్తుల ప్రత్యేక పూజలు, శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవాలయాలు..

* గుంటూరు : అమరావతిలోని కృష్ణా నది తీరాన నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిహారతి కార్యక్రమం….

* గుంటూరు : కార్తీక పౌర్ణమి సందర్భంగా అమరావతిలో కృష్ణానది తీరాన నేడు తెప్పోత్సవం…

* అనంతపురం: పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి గ్రామంలో గడప గడప కు మనప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* శ్రీ సత్యసాయి జిల్లా : మడకశిర నేడు కార్తీక పౌర్ణిమ పురష్కరించుకొని శివాలయాలలో కృతికోత్సవం

* శ్రీ సత్య సాయి జిల్లా : హిందూపురం పట్టణంలోని యల్లమ్మ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేడు పూలపల్లకి ఉత్సవం, లక్షదీపోత్సవం, జ్వాలాతోరణం .

Exit mobile version