1. తమిళనాడులో నేటి నుంచి అగ్నివీర్ మహిళా అభ్యర్థుల ర్యాలీ. మూడు రోజులపాటు కొనసాగనున్న అగ్నివీర్ ర్యాలీ.
2. గుజరాత్‌లో నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఎన్నికల ప్రచారం.
3. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,970 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.67,500 లుగా ఉంది.
4. నేడు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ మన్‌కీ బాత్ కార్యక్రమం.
5. ఫిఫా వరల్డ్‌కప్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు జపాన్ తో కోస్టారికా తలబడనుంది. సాయంత్రం 6.30 గంటలకు బెల్జియంని మొరాకో ఢీ కొట్టనుంది. రాత్రి 9.30 గంటలకు క్రొయేషియాతో తలపడనుంది కెనడా.
6.నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర. ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభం.
7. నేడు మంగళగిరిలో పవన్‌కల్యాణ్ పర్యటన. ఇప్పటం గ్రామస్తులకు చెక్కుల పంపిణీ. పార్టీ కార్యాలయంలో అందించనున్న పవన్ కల్యాణ్. ఇళ్లు కూల్చివేతతో నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కుల పంపిణీ.
8. నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై చర్చ. హాజరుకానున్న జిఇల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు.
9. నేడు సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ. కార్యక్రమానికి హాజరుకానున్న సినీ ప్రముఖులు, అభిమానులు. దశదిన కర్మ సందర్భంగా కృష్ణ విగ్రహం ఏర్పాటు.
