Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం. 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.

2. కరీంనగర్‌ టైన్త్‌ హిందీ పేపర్‌ లీక్‌ కేసులో నేడు ప్రశాంత్‌ సహా మరో ముగ్గురు జైలు నుంచి విడుదల. నిన్న బెయిల్‌ మంజూరు చేసిన హన్మకొండ కోర్టు. ఇప్పటికే జైలు అధికారులకు అందిన పత్రాలు.

3. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,400 లుగా ఉంది.

4. నేడు సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టులో విచారణ. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే నివేదిక ఇచ్చిన సిర్పూర్కర్‌ కమిషన్‌.

5. ఢిల్లీలో నేడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో విచారణ. రేపు కూడా విచారించనున్న ట్రిబ్యునల్.

6. నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో కోల్డ్‌ స్టోరేజ్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న కేటీఆర్‌. అనంతరం వ్యవసాయ కళాశాలను ప్రారంభించనున్న కేటీఆర్‌. దీంతో పాటు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కేటీఆర్‌. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం, మంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొననున్నారు.

7. నేడు ఎల్బీస్టేడియంలో తెలంగాణ సర్కార్‌ ఇఫ్తార్‌ విందు. సాయంత్రం ఇఫ్తార్‌ విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌.

8. నేడు రాహుల్‌గాంధీ పిటిషన్‌పై సూరత్‌కోర్టులో విచారణ. పరువునష్టం కేసులో జైలు శిక్ష విధించిన కింది కోర్టు. తీర్పు సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేసిన రాహుల్‌గాంధీ.

9. ఐపీఎల్‌లో నేడు చెన్నై వర్సెస్‌ రాజస్థాన్‌. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌.

10. నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. మార్కాపురంలో సీఎం జగన్‌ బహిరంగ సభ. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్‌.

Exit mobile version