Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఇవాళ ఏపీకి కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖా మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోనీ కేంద్ర బృందం.. సీఎం చంద్రబాబుతో సమావేశం

మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత బలోపేతంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం

ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కీలక అంశలపై సమీక్ష

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అన్ని బస్టాండుల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎంయూఏ ధర్నాలు.. తమ డిమాండ్లు పూర్తి చేయాలంటూ ధర్నాలు.. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీకి ధర్నా నోటీసులు ఇచ్చిన ఎన్‌ఎంయూఏ

దేశ సైన్యానికి దైవ బలం ఉండాలని ప్రార్థిస్తూ జనసేన నాయకులు ఇవాళ ఉదయం 8 గంకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూజలు.. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయనున్న మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్

నేడు తిరుపతి గంగమ్మ జాతర.. జాతరలో బాగంగా నేడు పేరంటాల వేషం.. అర్ధరాత్రి అమ్మవారి ప్రత్యేక అభిషేకం

నేడు పెద్దాపురంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రులు

ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. జమ్మూకశ్మీర్ ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

రామగిరి హెలికాప్టర్ ధ్వంసం ఘటనలో నేడు విచారణకు ప్రధాన పైలట్ అనిల్ కుమార్.. గతంలో రెండుసార్లు నోటీసులిచ్చినా హాజరుకాని మెయిన్ పైలట్

ఈరోజు భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు

నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. 90 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి

ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశం

Exit mobile version