ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం.. హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతలు
నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తి’ కార్యక్రమం.. సాయత్రం 5 గంటలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
నేడు ఏలూరులో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన.. ఎమర్జెన్సీ డే విధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశానికి హాజరు
మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని క్వాష్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. పల్నాడు వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందిన ఘటనలో పేర్ని నాని, విడదల రజనిపై కేసు నమోదు.. ఈ కేసు క్వాష్ చేయాలని మాజీ మంత్రుల పిటిషన్లు
ఇవాళ్టి నుంచీ రెండు రోజుల పాటు మాజీ మంత్రి కాకాణిని కస్టడీకి తీసుకోనున్న సిట్.. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ అక్రమ రవాణాకు ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. కేసులో A2గా ఉన్న మాజీ మంత్రి
నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జరిగే మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల సమీక్షలో పాల్గొననున్న మంత్రి
నేటి నుండి రెండు రోజుల పాటు రాయచోటి నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్న మంత్రి
ఇవాళ మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. చెన్నూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
నేడు సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశం
నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య 2వ టెస్ట్ ఆరంభం.. కొలంబోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం
