Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను రెండో రోజు విచారించనున్నారు. పోలీసులు తమ కస్టడీలో సతీష్‌ను ప్రశ్నలు అడగనున్నారు.

ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన జరగుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పెద్ద శంకరంపేటలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు మాజీమంత్రి హరీశ్‌రావు రానున్నారు. రుణమాఫీపై బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.

నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చర్చ ఆరంభం కానుంది. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ న్యాయ విచారణ జరపనున్నారు. 100 రోజుల్లోపు విచారణ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, దీనికి అనుగుణంగా కమిషన్‌ కార్యాచరణ ఉంటుందని ఆయన చెప్పారు.

నేడు నాంపల్లిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. మల్లేపల్లి, అసిఫ్ నగర్‌లో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సాయంత్రం తార్నాక, మెట్టుగూడ, అడ్డగుట్టలో ప్రచారం చేయనున్నారు.

నేడు కందుకూరు, నెల్లూరులో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.

Exit mobile version